Wednesday, May 7, 2025
- Advertisement -

స‌ల్మాన్‌ఖాన్ హీరోయిన్‌కు విల‌న్ సాయం

- Advertisement -

స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టించిన హీరోయిన్ ప్ర‌స్తుతం చేతిలో డ‌బ్బులేక ఆస్ప‌త్రిలో వైద్యం చేయించుకోలేని ప‌రిస్థితిలో ఉంది. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యింది. కానీ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆమె దీన‌గాథ‌ను ప‌రిశీలించిన ఓ న‌టుడు స‌హాయం చేశాడు. త‌న‌కు తోచినంత స‌హాయం చేసి ఆమెను ఆదుకున్నాడు.

ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్రియ ద‌డ్వాల్ క్షయ వ్యాధితో బాధపడుతూ ముంబయిలోని టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె దీన ప‌రిస్థితి గురించి తెలుసుకున్న న‌టుడు రవికిషన్ ఆదుకున్నాడు. ర‌వికిష‌న్ ఎవ‌రో తెలుసా అల్లు అర్జున్ న‌టించిన రేసుగుర్రం సినిమాలోని విల‌న్ పాత్ర‌ధారి. ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న రవికిషన్‌ తన స్నేహితుడు ఉదయ్‌ భగత్ ద్వారా సాయం చేశారు. చికిత్సకు కావాల్సిన న‌గ‌దుతో పాటు పండ్లు కూడా అందించారు. ప్రియ పరిస్థితిని వివరిస్తూ ఉదయ్‌ భగత్ ఓ వీడియోను‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ప్రియ 1990లో స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన ‘వీర్‌ఘటి’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. గోవాలో క్యాసినో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్న ప్రియకు కొన్నేళ్ల కింద‌ట‌ క్షయ వ్యాధి సోక‌డంతో భర్తతో పాటు ఇంట్లో వారు కూడా వదిలివెళ్లిపోయారు. దీంతో ప్రియ 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కనీసం టీ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విష‌యం వెలుగులోకి రావ‌డంతో వైర‌లైంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -