Thursday, May 16, 2024
- Advertisement -

ఒకొప్పుడు సీబీఐ అంటే ముద్దు…ఇప్పుడు చేదా…? రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకీ బాబు బ్రేక్‌

- Advertisement -

సీబీఐ అంటేనే ప‌చ్చ‌పార్టీ నాయ‌కులు ప్యాంట్లు త‌డుపు కుంటున్నారు. గ‌తంలో ఎన్నో కేసుల్లో సీబీఐ విచార‌ణ కోరిన బాబు ఇప్పుడు అది అంటేనే జ‌డుసుకుంటున్నాడు. ఎక్క‌డ త‌ను చేసి కుంభ‌కోణాలు బ‌య‌ట‌కు వ‌స్తాయోన‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ కాకుండా బ్రేక్ వేశారు.

స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సీబీఐ, కేంద్రం చెప్పినట్లల్లా నడుచుకుంటోందని ఆరోస్తున్న ఏపీ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వ తాజా ఉత్తర్వుతో ఇకపై సీబీఐ అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కార్యకలాపాలూ స్వతంత్రంగా నిర్వహించలేరు. బాబు త‌న కుట్ర‌లో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు.

రాష్ట్రంలో, దాడులు దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఏపీ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘‘సమ్మతి’’ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్గత కుమ్ములాటలతో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రతిష్ట మసకబారిందని… రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్వర్వుల్లో పేర్కొంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఏర్పాటు చేసింది.

గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీబీఐదాడు నిర్వ‌హిస్తోంది. ప్ర‌ధానంగా టీడీపీ బ‌డా నాయుకుల‌పైనే గురి పెట్టింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌న‌లు రావ‌డంతో సీబీఐ దాడులు చేస్తోంది. అదే విధంగా పోల‌వ‌రం, ఇసుక, భూకుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని వాటిపై సీబీఐ చేత విచార‌ణ జ‌ర‌పాల‌ని భాజాపా నేత‌లు ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది.

అంతే కాకుండా రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలచే దర్యాప్తు చేయాలని ఆ పార్టీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ జిర‌గితే ఎక్క‌డ త‌మ బండారం బ‌య‌ట ప‌డుతుందోన‌నే భ‌యంతోనే ఈ నిర్ణ‌యం తీసున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

ఒకప్పుడు సీబీఐని కీర్తించిన చంద్రబాబు.. ఇప్పడు సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ నిర్ణయం తీసుకోవడం మారోమారు ఆయన అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కేంద్ర సంస్థలు నిగ్గు తెలుస్తున్న వేళ.. ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహారించడం వల్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -