Friday, May 3, 2024
- Advertisement -

పోరాటాలు చేయనున్న రవి తేజ

- Advertisement -

చాలా రోజుల నుండి రవి తేజ సినిమా ల గురించి మనకి అప్డేట్స్ ఏమి లేవు. రవి తేజ రిలాక్స్ అయిపోయాడు అని, సినిమా ల మీద ఇంట్రెస్ట్ తగ్గింది కానీ పారితోషికం మీద ధ్యాస పెరిగింది అనే కామెంట్స్ వస్తున్నాయి. డిస్కో రాజా అనే చిత్రాన్ని వీ ఐ ఆనంద్ అనే దర్శకుడి తో ప్రారంభం చేసినప్పటికీ ఆ సినిమా మొదలు కావడానికి చాలా సమయమే పట్టింది. ఇక షూటింగ్ మొదలయిందో లేదో, మరలా ఏవో ఆటంకాల వలన వాయిదా పడుతూ రావడం తో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే డైలమా ఇటు మీడియా లో నూ, అటురవి తేజ అభిమానుల్లో నూ ఉంది.

అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు, ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ మే 28వ తేదీ నుండి హైదరాబాదలో మొదలు కానుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర వర్గాలు ఇప్పుడు మొదలు కానున్న ఈ కొత్త షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు చిత్ర యూనిట్. జూన్ మూడవ వారం వరకు ఈ షెడ్యూల్ హైదరాబాద్లోనే జరగనుంది.

నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -