Thursday, May 16, 2024
- Advertisement -

రాజకీయాలకు రాములమ్మ గుడ్ బై ?

- Advertisement -

సినిమా పరిశ్రమ లో రాములమ్మ గా తన ప్రతిభ ని అందరికీ పరిచయం చేసి లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ గా అందరి మన్ననలు పొందిన విజయ శాంతి రాజకీయాల్లో కి కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్ర సమితి లో చేరి పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికై తర్వాత బయటకు వచ్చి తల్లి తెలంగాణా పార్టీ పెట్టి, దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. గత కొద్దీ రోజులు గా కాంగ్రెస్ లో యాక్టివ్ రోల్ చేస్తున్న విజయశాంతి ప్రస్తుతం ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుండి వైదొలిగితే తాను రాజకీయాల నుండి వైదొలుగుతాను అన్నారు. “రాహుల్ గాంధీ గారు విజ్ఞత దేశప్రజల పట్ల అంకితభావం భవిష్య భారతదేశం గురించి దార్శనికత ఉన్న నేత. ఏ విధమైన అహంభావము లేని నిష్కల్మషమైన నిరాడంబరపు మనిషి. INC కి ఆ న్యాయకత్వం ప్రస్తుతం ఎంతైనా అవసరం. గత ఐదేళ్ళ కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించిన రాహుల్ గాంధీని కాకుండా మరొకర్ని అధ్యక్షస్థానంలో చూడటానికి మాలాంటి చాలామంది నేతలకు మనసు అంగీకరించడం లేదు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి రాహుల్ గాంధీజీ వైదొలిగితే ఆ అధ్యక్షుని ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాన్నిఒక పోరాటం లెక్క నడిపించిన నాలాంటి అసంఖ్యాక కార్యకర్తలు,రాజకీయాలకు దూరంగా ఉండాలనేి అభిప్రాయాన్నితీసుకోవాల్సిన పరిస్థితులు అనివార్యమవుతాయి. ఆ సందర్భంలో మొదట నేనే ఉంటాననేది నా నిర్ణయమని విస్పష్టంగా తెలియజేస్తున్నాను.” అని విజయశాంతి తన ట్విట్టర్ ప్రొఫైల్ లో పేర్కొనడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -