Friday, March 29, 2024
- Advertisement -

‘ఖిలాడీ’ టీజర్ రిలీజ్.. మాస్ రాజా మళ్లీ హిట్ కొట్టేలా ఉన్నాడే..!

- Advertisement -

కరోనా కాటుకు కుదేలైంది సినీ రంగం. ఇక లాక్ డౌన్ సడలింపు తర్వాత థియేటర్లు మళ్లీ ఓపెన్ అయ్యాయి. ఈ సమయంలోనే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ మూవీతో మాస్ మహరాజ రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది. ఇదే ఊపులో రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. రవితేజ ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని తాను ఈ సినిమాను చేస్తున్నట్టుగా రమేశ్ వర్మ చెప్పాడు.

తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో రవితేజ లుకింగ్ స్టైలిష్ గా ఉండటమే కాదు.. యాక్షన్, ఎమోషన్ సీన్లు కనిపిస్తున్నాయి. అంతే కాదు యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అన్ని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.

చివరిగా యూ ప్లే స్మార్ట్.. విత్ ఔట్ స్టుపిడ్ క్వచ్చన్.. యు ఆర్ అన్ స్టాపబుల్ అనే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. అయితే రవితేజ ఎందుకు క్రిమినల్ గా మారాడు? ఎందుకు జైలుకు వెళ్లాడు? అనే ఆసక్తిని ఈ టీజర్ రేకెత్తిస్తోంది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.

నాగబాబు వర్సెస్ పేర్ని నాని ట్విట్స్ యుద్దం!

నేటి పంచాంగం, సోమవారం(12-06-2021)

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -