Tuesday, April 23, 2024
- Advertisement -

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

- Advertisement -

అల్లు అర్జున్ త‌నదైన అభిన‌యంతో వెండితెర‌పై అద‌ర‌గొట్టి స్టైల్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నారు. సూప‌ర్ డైరెక్ష‌న్‌తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్. వీరిద్ధ‌రి కాంభినేష‌న్‌లో ఇదివ‌ర‌కే ఆర్య‌, ఆర్య‌-2 సినిమాలు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించాయి. మ‌ళ్లీ వీరిద్ధ‌రూ క‌లిసి చేస్తున్న చిత్రం పుష్ప‌.

ఈ సంవ‌త్స‌రం సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప ఒక‌టి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ట్రైల‌ర్ దుమ్మురేపుతోంది. మొద‌టి షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే విడుద‌ల తేదీని సైతం ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే, ప్ర‌క‌టించిన తేదీకి ఈ సినిమా విడుద‌ల అవుతుందా? అనేదానిపై సందిగ్ధం నెల‌కొంది.

ప్ర‌క‌టించిన రిలీజ్ డేట్ ఆగ‌స్టు 13ను అందుకుంటామా? లేదా? అని చిత్ర యూనిట్ సైతం ఆందోళ‌న చెందుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి ప్ర‌ధాన కార‌ణం క‌రోనా. ఎందుకంటే దేశంలో ఇప్పుడు క‌రోనా విజృంభిస్తోంది. దీంతో చిత్ర షూటింగ్ పై ప్ర‌భావం ప‌డింది. క‌రోనాతో ఇప్ప‌టికే ప‌లు సినిమాలు వాయిదాప‌డ్డాయి. కాగా, పుష్ఫ రిలీజ్ డేట్‌ను మార్చాల‌నీ, ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ కు మారాలని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ద‌ట‌. ఇదే గ‌న‌క జ‌రిగితే దీపావ‌ళి లేదా క్రిస్మ‌స్‌కు పుష్ప ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవకాశముంది.

ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్‌ !

కరోనా టీకా.. పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

దేశంలో కొత్తగా 1.52 లక్షల కరోనా కేసులు

72 గంట‌ల్లో 12 మంది ఉగ్ర‌వాదులు హ‌తం !

హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -