Saturday, May 11, 2024
- Advertisement -

ముస‌లిత‌నం అంటే చేత‌కాని త‌నంకాదురా…నిలువెత్తు అనుభ‌వం..నేల టికెట్ ట్రైల‌ర్‌

- Advertisement -

ముస‌లిత‌నం అంటే చేత‌కాని త‌నంకాదురా…నిలువెత్తు అనుభ‌వంరా మాస్ రాజా మాస్ మసాలా ఎంటర్ టైనర్ మూవీ ‘నేల టిక్కెట్టు’ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి హిట్స్ అందించిన కళ్యాణ్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం నాడు విడుదల చేశారు.

ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు’ అంటూ రవితేజ డైలాగులు కొడుతున్నాడు. ఈ ట్రైలర్‌లో రవితేజ వృద్ధులకు సాయం చేస్తూ వారి పక్షాన మాట్లాడుతున్నాడు. అలాగే, జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనపడుతూ ‘నేను ఎదగడానికి ఎంత మందినైనా తొక్కేస్తాను’ అంటూ డైలాగు కొట్టాడు.

నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’ అంటూ టీజర్‌లోనే పవర్ చూపించిన మాస్ రాజా.. ట్రైలర్‌లోనూ అదే స్థాయిలో ఎనర్జీని చూపించాడు. కామెడీ, ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుతో ‘నేల టిక్కెట్టు’ ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రూపొందించారు. ‘ఫస్ట్ టైం లైఫ్‌లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఓ కొత్త రిలేషన్ కనిపిస్తుందిరా..’. ‘ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడ్రా.. కాని సాయం చేసేవాడు ఒక్కడు లేడు’. ‘ముసలితనం అంటే చేతకాని తనం కాదురా.. నిలువెత్తు అనుభవం..’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -