మాస్ రాజా రవితేజకు ఈ మధ్య కాలం కలిసి రావడం లేదు. తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో రవితేజ్ స్టార్‌డం కాస్తా తగ్గిందనే చెప్పాలి. గతంలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఓ వెలుగు వెలిగిన రవితేజ, ఇప్పుడు హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా కొట్టడంతో తదుపరిచిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రవితేజ.ప్రస్తుతం రవితేజ కొత్త దర్శకుడు ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఈ ఆప్టెడ్ బయటికి వచ్చింది. ఈ నెల 26న రవితేజ పుట్టిన రోజు కావడంతో సినిమాలోని రవితేజ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ మరోసారి రవితేజ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’