Friday, May 17, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ర‌వితేజ సెటైర్‌

- Advertisement -

ర‌వితేజ సినిమాల‌లోనే చాలా హంగామాగా ఉంటాడు. నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాడు.త‌న సినిమాలు రిలీజు అప్పుడు త‌ప్ప బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌డు కూడా.ఎన్న‌డు వివాదాల‌కు జోలికి పోడు. ఇండ‌స్ట్రీలో ర‌వితేజ‌కు మంచి పేరు ఉంది.అలాంటి ర‌వితేజ ఇప్పుడు చిన్న వివాదంలో చిక్కుకున్నాడు. రవితేజ లేటెస్ట్ మూవీ టచ్ చూసి చూడు ప్రమోషన్ లో భాగంగా అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ సెషన్ కు వచ్చాడు.

మొదట్లోనే ఓ పవర్ స్టార్ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పమని అడిగాడు. దానికి రవితేజ సింపుల్ గా ఇచ్చిన ఆన్సర్ నెక్ట్స్ (next). అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టలేనప్పుడు నెక్ట్స్ అంటూ దాటేయడం మామూలే. ఈ ప్రశ్నకు కూడా రవితేజ ఇలా మాట దాటేయడం సెషన్ ను ఫాలో అవుతున్న అభిమానులను ఆశ్చర్య పరిచింది. కాసేపట్లోనే లేనిపోని వివాదం అయ్యే ప్రమాదముందన్న డౌట్ వల్లో ఏమో ఆ ట్వీట్ ను సెషన్ నుంచి డిలెట్ చేసేశాడు ర‌వితేజ‌.ర‌వితేజ ప‌వ‌న్ పై సెటైర్‌ వేశాడే అని చ‌ర్చించుకుంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -