Wednesday, April 24, 2024
- Advertisement -

పునీత్ రాజ్ కుమార్ ఇంకా బతికే ఉన్నారా ? అలా ఎందుకంటే ?

- Advertisement -

2021 అక్టోబర్ 29. కన్నడ పవర్ స్టార్ అభిమానులకు పెను విషాదం నింపిన రోజు. 46 ఏళ్ల వయసులోనే కోట్లాది మంది అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయాడు అప్పు. కన్నడలో పునీత్‌ను అంతా ప్రేమతో అప్పు అని పిలుచుకుంటారు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ అస్వస్థతకు గురైన పునీత్.. ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశారు. ఆయన మరణం యావద్దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఇప్పటికీ ఆయన మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే పునీత్ ఇప్పటికి బతికే ఉన్నారు. అవును ఆయన మేనత్త నాగమ్మకు పునీత్ లేడన్న విషయం ఇంకా తెలియదు. తెలియజెప్పేందుకు పునీత్ కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నించడంలేదు. 90 ఏళ్ల వయస్సున్న నాయమ్మ డాక్టర్ రాజ్‌ కుమార్ సోదరి. పునీత్ తో పాటు ఆయన అన్నలను చిన్నప్పుడు ఆవిడే పెంచారు. వారంటే ఆమెకు పంచప్రాణాలు. అందుకే పునీత్ లేడన్న విషయం ఆమెకు చెబితే ఏమైపోతారోనని కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. పునీత్ అన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్‌కు కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గతంలో గుండెపోటు వచ్చింది. అదృష్టవశాత్తూ ఆయన గండం నుంచి బయటపడ్డారు. కానీ గుండెపోటు విషయం తెలియగానే నాగమ్మ ఆస్పత్రి పాలయ్యారు. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.

గజనూర్‌లో ఉండే నాగమ్మకు పునీత్ మరణించిన విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆవిడ ఎప్పుడైనా పునీత్‌ను చూడాలని అడిగితే.. అతడు విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాడని చెబుతున్నారు. ఆయన సినిమాలను చూపిస్తుండటంతో నాగమ్మ సంతోషంగా ఉంటోందని వారు చెబుతున్నారు. ఊరివాళ్లు కానీ.. బంధువులు గానీ ఆమె ఇంటికి వచ్చినా…పునీత్ మరణం గురించి ప్రస్తావించకుండా కుటుంబ సభ్యులు చూస్తున్నారు. ఇటీవలే రాఘవేంద్ర రాజ్‌కుమార్.. నాగమ్మను చూసేందుకు స్వగ్రామం వచ్చారు. పునీత్ మరణించిన విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఆఖరి వయసులో ఆమెను బాధపెట్టలేక కుటుంబ సభ్యులు దుఃఖాన్ని తమలోనే దాచుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -