Friday, April 26, 2024
- Advertisement -

రవితేజ యాక్షన్ ధమాకా

- Advertisement -

రవితేజ కథానాయకుడిగా,త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధమాకా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ‘డబుల్ ఇంపాక్ట్’ అనేది ట్యాగ్ లైన్. రవితేజ తదితరులపై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వదిలారు.

ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ .. “ఒక భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. బడ్జెట్ పరంగా ఏ విషయంలోనూ రాజీ పడకుండా ముందుకు వెళుతున్నాం. రవితేజ అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా శ్రీలీల కనిపిస్తోంది. రవితేజ కథానాయకుడిగా ఇటీవలే ‘ఖిలాడి’ సినిమా థియేటర్లకు వచ్చింది . తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ని లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన త్వరలో క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -