Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ర‌వితేజ‌

- Advertisement -

రాజా ది గ్రేట్ సినిమా విజ‌యంతో ర‌వితేజ ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు వ‌రుస సినిమాల‌కు సైన్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న సినిమా ‘టచ్‌ చేసి చూడు’. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో రవితేజ మ‌రోసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొడుతుండగా, ఓ వ్యక్తి మెడలో టైరు వేసి ఈడ్చి పారేస్తూ రవితేజ కనిపించారు. ఆ తర్వాత కళ్లద్దాలు తీసి స్టైల్‌గా రవితేజ నడిచి వస్తూ టీజ‌ర్‌లో క‌నిపిస్తున్నాడు.

భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తుండ‌గా ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ నాని నిర్మాణంలో వ‌స్తున్న ‘అ!’ సినిమాలో చెట్టుకు వాయిస్‌ ఓవర్ ఇస్తున్నారు. ఆ త‌ర్వాత కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్ర‌వారం ప్రారంభమైంది. మాళవిక శర్మ హీరోయిన్‌గా రామ్‌ తుళ్లూరి నిర్మాణంలో వ‌స్తున్న ఈ సినిమాకు ‘నేల టికెట్‌’ టైటిల్ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -