Tuesday, May 7, 2024
- Advertisement -

ఇద్ద‌రి మ‌ధ్య ముదురుతున్న‌ట్విట్ట‌ర్ వార్‌..

- Advertisement -

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కత్తి మహేశ్‌ మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతూనే ఉంది. కత్తి మహేశ్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం.. దానికి బదులుగా పవన్‌ అభిమానులు కత్తిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ దుర్భాషలాడటం కొనసాగుతూనే ఉంది.

తాజాగా ప‌వ‌న్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ’ వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు. (ఎవరు చెప్పారో తెలియదు కానీ ఓ సీనియర్‌ జర్నలిస్టు ఉదయాన్నే నాకు పంపించారు. బాగుందని షేర్‌ చేస్తున్నా’ అని పవన్‌ పేర్కొన్నారు.

 

మరోవైపు కత్తి మహేశ్‌ సైతం పవన్‌ ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు. ‘ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా…అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త’ అంటూ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ కామెంట్‌పై ఓ నెటిజిన్ ప్రశ్నిస్తూ ‘మీలో మీరు మాట్లాడుకుంటున్నారా?’ అన్నారు… పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు సమాధానం ఇచ్చానంటూ కత్తి స్పష్టం చేశారు.

 

ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా…అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!!!

ప‌నిలో ప‌నిగాఅజ్ఞాతవాసి సినిమాపై కూడా కత్తి మహేశ్ విమర్శలు గుప్పించాడు. ప్రీమియర్లు విచ్చలవిడిగా వేసుకోవచ్చు… టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. అదనపు ఆటలకు కూడా అనుమతి… ప్రజల డబ్బులు ఘరానాగా దోచుకునే ప్లాన్ రెడీ అంటూ వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ సలాం ఒకరికి, గులాంగిరి మరొకరి చేసి సాధించుకున్న హక్కులు ఇవి… కానీ పాపం, త్రివిక్రమ్ సినిమాని కాపీకొట్టి ఇబ్బందులపాలు చేశాడని వినికిడి అని ఆరోపించారు

పవన్‌ రాజకీయ విధానాలను కత్తి మహేశ్‌ ఘాటుగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్‌ అభిమానులను ఆగడాలను సైతం ఆయన ఫేస్‌బుక్‌లో ఎండగడుతున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ పేరిట కొందరు చేస్తున్న దుర్భాషలను ఫేస్‌బుక్‌ వేదికపై బహిర్గతం చేస్తున్నారు. ఈ వివాదం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెల్తాద‌నేది ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -