Friday, May 10, 2024
- Advertisement -

అలాంటి సినిమాల్లో చేయాలని ఉందంటున్న రవితేజ

- Advertisement -

ఇప్పటికే జనాలను చాలా రోజలుగా వెయిట్ చేయిస్తున్న కిక్ -2 సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాను వచ్చే వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

కల్యాన్ రామ్ వంటి పేరున్న హీరో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నా.. విడుదల విషయంలో ఏవో ఆటంకాలు ఏర్పాడ్డాయి. ఎట్టకేలకూ అవి కాస్తా క్లియర్ అయ్యి ఆగస్టు ఇరవై ఒకటిన కిక్ సినిమా సీక్వెల్ ను విడుదల చేస్తున్నారు.

మరి ఇలాంటి నేపథ్యంలో రవితేజ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్ డ్రీమ్స్ ఏమీ లేవని స్పష్టం చేశాడు. తన సినిమాలు అనేకం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నా.. విక్రమార్కుడు వంటి సినిమాలు అక్కడ సూపర్ హిట్ అయినా.. తనకు బాలీవుడ్ లో నటించాలనే ఆసక్తి మాత్రం ఏమీ లేదని రవితేజ స్పష్టం చేశాడు. అయితే తనకు మల్టీ స్టారర్ సినిమాల్లో చేయడానికి మాత్రం తను రెడీ అని ఈ హీరో ప్రకటించాడు!

ఇతర స్టార్ హీరోలతో స్క్రీన్ ను షేర్ చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని రవితేజ స్పష్టం చేశాడు. మంచి కథలు దొరికితే ఇతర హీరోలు సై అంటే.. వారితో కలిసి కనిపించడానికి తను సిద్దం అని ప్రకటించాడు. మరి ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలకు మల్టీ స్టారర్ లకు సిద్ధం అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో రవితేజ కూడా వారిలో ఒకడయ్యాడు. ఇక దర్శకులదే లేటు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -