Thursday, April 25, 2024
- Advertisement -

విరాట్ కొహ్లీ.. మంచి బ్యాట్స్ మన్ ను తొక్కేస్తున్నాడా!

- Advertisement -

జట్టు విజయాల్లో ఉంటే ఎలాంటి వివాదాలూ ఉండవు. అయితే ఒక్కసారి టీమ్ ఓటమి పాలయ్యిందా.. దాన్ని వివాదాలు వెంటాడతాయి. ఇప్పుడు భారత జట్టు పరిస్థితి కూడా ఇలానే ఉంది.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా తొలి మ్యాచ్ లో మంచి స్థితిలో కనిపించి ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిన జట్టు.. సెకెండ్ ఇన్నింగ్స్ లో చేజింగ్ లో దారుణంగా విఫలం అయ్యింది. చిత్తు చిత్తుగా ఓడింది.

ఇలాంటి నేపథ్యంలో టీమిండియా పై విమర్శల వాన కురుస్తోంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ… టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మరో అంశం కూడా వార్తల్లోకి వచ్చింది. అదేమిటంటే.. చటేశ్వర్ పూజారాను కావాలని పక్కనపెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆరంగ్రేటం దగ్గర నుంచి మంచి పేరును కలిగి ఉన్న పూజారాను బ్యాటింగ్ విషయంలో రాహుల్ ద్రావిడ్ తో పోల్చారు విశ్లేషకులు. అయితే పూజారా అంటే కొహ్లీకి నచ్చడం లేదని తెలుస్తోంది.

వరసగా ఫెయిల్యూర్ అవుతున్న వారికి జట్టులోని ఎలెవన్ లో స్థానం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్న కెప్టెన్ కొహ్లీ, మేనేజర్ రవిశాస్త్రిలు.. పూజారాను పట్టించుకోవడం లేదు. మంచి సగటును కలిగి ఉన్న ఆ బ్యాట్స్ మన్ కు జట్టులో స్థానం కల్పించడం లేదు. దీంతో ఇప్పుడు విమర్శలు రేగుతున్నాయి. అది కూడా తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లో ఫెయిల్యూర్ కావడంతో పూజారా కు చోటు కల్పించకపోవడంపై విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. అయితే కొహ్లీ, శాస్త్రిలు మాత్రం ఈ విషయం పట్టనట్టుగా ఉన్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -