Monday, May 6, 2024
- Advertisement -

పంది పిల్ల మెయిన్ లీడ్ లో ” అదుగో ” సినిమా

- Advertisement -

అవును లాంటి డిఫరెంట్ టైటిల్స్ పెట్టడమే కాదు , కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీయడం లో కూడా డైరెక్టర్ రవిబాబు కి తిరుగు లేదు. కేవలం ఒక పంది పిల్లని సెంటర్ గా చేసుకుని ఆయన కొత్త సినిమా తీసారు. పంది పిల్లని మెయిన్ రోల్ లో పెట్టి సినిమా తీయడం అంటే అదంత చిన్నా చితకా వ్యవహారం కానే కాదు.

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సపోర్ట్ తో తీసిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ గా ఉంది.  ” అదుగో ” అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ స్క్రిప్ట్ తో సినిమా రూపొందించడంలో ఎదురైన అనేక సవాళ్ళను దాటి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త నటీనటులు అభిషేక్, నాభ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల గురించి వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -