Thursday, April 25, 2024
- Advertisement -

ర‌వితేజ వ‌ర్సెస్ విజ‌య్ దేవ‌ర కొండ‌

- Advertisement -

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’ రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మాటేవినదుగా.. వినదుగా అంటూ విజయ్ ని పాడుకునేలా చేసిన ప్రియాంక జవాల్కర్ ఫుల్ జోష్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇక మిగతా ‘టాక్సీవాలా’ టీమ్ మెంబర్స్ కూడా ప్రచార కార్యక్రమాలు జోరుగా చేపడుతున్నారు.

ఇండ‌స్ట్రీలో సినిమా విడుద‌ల కాకుండానే లీక్ అవ‌డం సాదార‌ణం అయ్యింది. విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ వారం ముందు నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే లీక్ చేసిన వారిని పట్టుకున్నా..జైల్లో పెట్టిన అప్పటికే జరిగే నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాల’ వంతు వచ్చింది.

ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ దృశ్యాలు లీక్‌ కాగా. ఈ సినిమా ఎడిటిం గ్‌ సైతం కాకముందే హెచ్‌డీ ప్రింట్‌ నెట్‌కెక్కింది. సోషియ‌ల్ మీడియాలోనూ సినిమా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే టాక్సీవాలా సినిమాకు పోటీగా ర‌వితేజ న‌టించిన అమ‌ర్, అక్బ‌ర్‌, ఆంటోని వ‌స్తోంది.

రెండు సినిమాలు బేరీజు వేసుకుంటే విజ‌య్ దేవ‌ర కొండ సినిమానే టాక్‌లో దూసుకుపోనుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇద్ద‌రి మార్కెట్ ప‌రంగా చూసుకుంటే…. రవితేజకి ఎన్నో ఏళ్ల అనుభవం వుండొచ్చు. ఒక టైమ్‌లో తెలుగు సినిమా పరిశ్రమలో బిజీ హీరోగా వెలుగు వెలిగి వుండొచ్చు. కానీ ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హవా నడుస్తోంది. విజయ్‌ వర్సెస్‌ రవితేజ అని చూసుకుంటే విజయ్‌ సినిమాకే బిజినెస్‌ ఎక్కువ జరుగుతుంది. కలక్షన్లూ ఎక్కువ వస్తాయి. రవితేజ కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కంటే విజయ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ రెండింతలకి పైగా వసూలు చేసింది. ఎంత సీనియర్‌ అయినా కానీ విజయ్‌ సినిమాతో రవితేజ సినిమా పోటీకి వెళితే మాస్‌ మహారాజాకే డేంజర్‌.

అమ‌ర్ అక్బర్ ఆంటోనీ’. ఈ చిత్రంతో గ్లామర్ బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. రెండు సినిమాలు కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక దాని త‌ర్వాత ఒక‌టి విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. బాక్సాఫీసు వ‌ద్ద ఏ సినిమా క‌లెక్స‌న్ల‌ను రాబ‌డుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -