Friday, May 3, 2024
- Advertisement -

హ‌రికృష్ణ‌ప్యామిలీ చుట్టూ బాబు రాజ‌కీయాలు

- Advertisement -

తెలంగాణాలో టీడీపీ రాజ‌కీయాలు హ‌రికృష్ణ ప్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. కూట‌మిలో భాగంగా టీడీపీ 14 సీట్ల‌లో పోటీ చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. అయితే కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వ‌ర్గంపైనే ఇప్పుడు అద‌రి చూపు ప‌డింది. ఎక్కువ‌గా సీమాంధ్ర ఓట‌ర్లు, నంద‌మూరి అభిమానులు ఎక్కువ‌గా ఉండ‌టంతో హ‌రికృష్ణ కూతురు సుహాసినిని రంగంలోకి దింపేందుకు బాబు పావులు క‌దుపుతున్నారు.

ఈ మేరకు సుహాసిని విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిసింది. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం తెలంగాణా టీడీపీ న‌తేల‌తో సమావేశం కానున్నారు. అయితే ఈ స్థానం నుంచి సీనియ‌ర్ నేత మాజీమంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడ పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.

ఇటీవలనే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించారు.ఈ స్థానంలో హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందని టీడీపీ భావించింది. ఈ విషయాన్ని హరికృష్ణ కుటుంబసభ్యుల వద్ద చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు.

పోటీకీ క‌ళ్యాణ్ రామ్ నో చెప్ప‌డంతో చెల్లెలు సుహాసినిని పోటీలో నిలిపేందుకు బాబు రెడీ అవుతున్నారు. కూకట్ పల్లి నుండి సుహాసినిని బరిలోకి దిగడం జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టం లేదనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును సుహాసిని గురువారం నాడు కలిశారు. కూకట్ పల్లి నుండి సుహాసినిని బరిలోకి దింపనున్నారు.

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు బాబు త‌న మార్క్ రాజ‌కీయం చూపిస్తున్నారు. హ‌రికృష్ణ ప్యామిలీని ద‌గ్గ‌ర చేసుకోవ‌డంతో పాటు జూ. ఎన్టీఆర్‌కు చెక్ పెట్టేందుకు బాబు త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సుహాసిని త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తే అది టీడీపీకీ క‌ల‌సి వ‌స్తుంద‌నేది బాబు ప్లాన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -