ప‌వ‌న్‌కు తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం..ఏడుగురికి గాయాలు

జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రంగంపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప‌వ‌న్ కాన్వాయ్‌లోని లోని ఓ వాహ‌నాన్ని వేగంగా వ‌స్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 7గురికి గాయాల‌య్యాయి. వారిలో న‌లుగురు ప‌వ‌న్ బౌన్స‌ర్లు ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాదం అనంత‌రం ప‌వ‌న్ మ‌దుర‌పూడి విమానాశ్ర‌యం చేరుకున్న ప‌వ‌న్ విమానంలో హైద‌రాబాద్‌కు బ‌య‌లు దేరారు.

Related Articles

Most Populer

Recent Posts