Tuesday, May 14, 2024
- Advertisement -

మహేశ్ బాబు తర్వాత రవితేజకు అలాంటి అవకాశం వచ్చింది!

- Advertisement -

మహేశ్ బాబు- రవితేజ.. ఏ మాత్రం పోలిక పెట్టలేని వారు వీరిద్దరూ. అయితే ఈ లీడింగ్ హీరోలిద్దరి మధ్య ఇప్పుడు ఒక పోలిక కనిపిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడంలోని పోలిక ఇది. వీరిద్దూ ఇప్పుడు లిక్కర్  ను ప్రమోట్ చేస్తున్న హీరోలుగా నిలుస్తున్నారు. ఇది వరకే మహేశ్ బాబు ఒక ప్రముఖ మద్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలవగా.. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది.

ఒక బ్రాందీ కంపెనీకి రవితే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. తన ఎనర్జీని ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి వాడుకొంటున్నాడు ఈ హీరో. ఇప్పటికే ఒక మద్యంకంపెనీ పోస్టర్లపై మహేశ్ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రవితేజ నటించగా బ్రాందీ కంపెనీ యాడ్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇక దాన్ని టీవీలో ప్రసారం చేయడమే తరువాయి.

మరి ఇన్ని రోజులూ మద్యం కంపెనీలకు బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపిచండం జరిగింది. ఇప్పుడు తెలుగు హీరోలకు కూడా ఆ అవకాశం వచ్చింది. అయితే వీరు ప్రమోట్ చేస్తున్నది మద్యాన్ని కాబట్టి.. ఇదంతా అభినందించదగిన అంశం అయితే కాదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -