అవును. ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని కప్పి పుచ్చాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అదే పని టీవీ ,సినిమా నటులు కూడా చేస్తారు.
రవితేజ సినమా నటుడే కదా… అతను కూడా ఇదే పని చేశాడు.అయితే మనోడు అడ్డంగా దొరికిపోయాడు.కిక్ 2 ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో రవితేజ చూపిన లుక్ తో చాలామంది షాక్ తిన్నారు. ఏంటిరా బాబు ఇలా అయిపోయావేంటి అంటే….. అదేం లేదు జస్ట్ డైట్ మార్చానంతే అంటున్నాడు. అక్కడితో ఊరుకోకుండా ఇక నుంచి నేను మీకు ఇలాగే కనిపిస్తానని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
పైకి ఎంత డైటింగ్ అని చెప్పినా… రవితేజలోని ఈ చేంజ్ పై రకరకాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. రవితేజ ఏజ్ 47 ,సీనియర్ హీరోలు ఇతనికంటే ఎక్కువగా 50 దాటినవారు కూడా ఉన్నారు. అయితే వారి ఫుడ్ రహస్యం రవికి తెలియక ఇలా ఏజ్డ్ లుక్ లో దొరికిపోయాడా లేక
మరేమైనా కారణముందా అని పరిశ్రమలో సీరియస్ డిస్కషన్ జరుగుతుంది.