Tuesday, May 14, 2024
- Advertisement -

‘డిస్కో రాజా’గా ర‌వితేజ‌

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ‌కు గ‌త కొంతకాలంగా స‌రైన హిట్ లేదు.రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన వెంట‌నే రెండు ప్లాప్‌లు ప‌ల‌క‌రించాయి.ప్ర‌స్తుతం ర‌వితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ అంటోని’ సినిమాలో న‌టిస్తున్నాడు.ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న గోవా బ్యూటీ ఇలియాన హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా త‌రువాత సంతోష్ శ్రీనివాస్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు ర‌వితేజ‌.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. దసరాకి ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాకి ‘డిస్కో రాజా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ టైటిల్ నే ఖరారు చేయవచ్చని అంటున్నారు.అమర్ అక్బర్ అంటోని,డిస్కో రాజాల‌తో హిట్లు కొట్టి మ‌ళ్లీ త‌న ఫాంను అందుకోవాల‌ని భావిస్తున్నాడు ర‌వితేజ‌.మ‌రి ర‌వితేజ ఆశ‌లు ఈ రెండు సినిమాల‌తో నెర‌వెర‌తాయో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -