Friday, May 17, 2024
- Advertisement -

త్రిష నిశ్చితార్థం క్యాన్సల్ కావడానికి రీజన్లు ఇవే!

- Advertisement -

అధికారికంగా ప్రకటించలేదు కానీ.. హీరోయిన్ త్రిష నిశ్చితార్థం దాదాపుగా క్యాన్సిల్ అయినట్టేనని అంటున్నారు ఆమె సన్నిహితులు. తమిళనాడుకు చెందిన పారిశ్రామిక వేత్త వరుణ్ మణియన్ తో త్రిషకు జరిగిననిశ్చితార్థం దాదాపు కాన్సిల్ అయినట్టేనని వారు అంటున్నారు.

ఈ విషయం గురించి త్రిష మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా… వరుణ్ కూడా ఈ విషయం గురించి ధ్రువీకరించకపోయినా.. ఇది క్యాన్సిల్ అయినట్టేననే అభిప్రాయాలే గట్టిగా వినిపిస్తున్నాయి.

మరి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? అంటే..దానికి కూడా బలమైన రీజన్లనే వినిపిస్తున్నారు ఈ జంటకు సన్నిహితులైన వారు. వారి వెర్షన్ ప్రకారం… 

-వరుణ్ తండ్రి కి ఈ పెళ్లి ఇష్టం లేదు. పేరున్న పారిశ్రామిక వేత్త అయిన వరుణ్ తండ్రి తన కుమారుడికి తన సర్కిల్ నుంచే ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేద్దామని భావించాడు. అయితే కుమారుడి ఇష్టప్రకారం సమ్మతించాడు. అయితే పెళ్లి తర్వాత త్రిష సినమాల్లో నటించకూడదనేది ఆయన అభిప్రాయం.

-కానీ సినిమాలకు దూరం కావడం త్రిషకు ఇష్టం లేదు! దీంతో వీళ్లమధ్య విబేధాలు మొదలయ్యాయి.

-అక్కడ నుంచి మొదలు ఒకదాని తర్వాత మరో రీజన్ డ్యామినేషన్ చేస్తూ  పరిస్థితి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొనేంత వరకూ వచ్చిందని సమాచారం!

ప్రస్తుతానికి అయితే.. త్రిష- వరుణ్ ల మధ్య మాటల్లేవు అని.. వీల్లిద్దరూ మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నిశ్చితార్థం అప్పుడు చేసిన ప్రకటనను బట్టి చూస్తే వీరి పెళ్లి జూన్ లో జరగాలి. అదెంతో దూరం లో లేదు! కాబట్టి ఈ అంశం గురించి త్వరలోనే క్లారిటీ వస్తుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -