Saturday, May 4, 2024
- Advertisement -

హీరోయిన్స్‌ని మెయింటెయిన్ చేయడంలో మెగా హీరోలను మించిపోయిన నానీ

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్ నంబర్ ఒన్ హీరో అవ్వడానికి దోహదం చేసిన అంశాలు చాలానే ఉన్నాయి. అఫ్కోర్స్ అన్నింటికీ మించినది మాత్రం తన ప్రతిభతో చిరంజీవి తెచ్చుకున్న బాక్స్ ఆఫీస్ స్టామినానే. అయితే అప్పట్లో చిరంజీవి ప్లానింగ్ కూడా చాలా బాగుండేది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్…..ఇతర స్టార్ టెక్నీషియన్స్‌ని కూడా తన గ్రిప్‌లో పెట్టుకునేవాడు. వాళ్ళతో సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేసేవాడు. ఈ వ్యవహారాలన్నీ అల్లు అరవింద్ చూసుకునేవాడు. చిరంజీవి సినిమాలకు అందరూ కూడా ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేలా…….ఇండస్ట్రీలో ఏదైనా బెస్ట్ స్టోరీ ఉన్నా, లేకపోతే టాలెంటెడ్ టెక్నీషియన్ ఉన్నా ముందుగా అతను చిరంజీవి క్యాంప్‌నే అప్రోచ్ అయ్యేలా ప్రాపర్ ప్రోగ్రామింగ్ చేసేవాడు అల్లు అరవింద్.

ఇక హీరోయిన్స్ విషయంలో కూడా మెగా క్యాంప్ చాలా ప్లాన్డ్‌గా ఉండేది. చిరంజీవి సూపర్ట్ స్టార్‌గా ఎదుగుతున్నప్పుడు ఉన్న హీరోయిన్స్ అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండేలా…..డేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అడ్జెస్ట్ చేసేలా అల్లు అరవింద్ ప్లాన్ చేసేవాడు. ఇప్పటి తరం హీరోయిన్స్ విషయంలో కూడా అల్లు అరవింద్ అండ్ మెగా ప్లానింగ్ అలానే ఉంది. అందుకే కాజల్ నుంచి తాజా సెన్సేషన్ పూజా హెగ్డే, రకుల్ ప్రీత్, రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ల వరకూ అందరూ కూడా అరవింద్‌కి రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. హీరోయిన్స్‌ని మెగా ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది అన్న పేరు కూడా ఉంది. అందుకే మెగా హీరోలకు ఎప్పుడూ కూడా హీరోయిన్స్ డేట్స్ ప్రాబ్లమ్స్ రావు.

అయితే ఇప్పుడు మెగా హీరోలను మించి అనే స్థాయిలో హీరోయిన్స్‌తో రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు నానీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు హీరోయిన్స్‌కి కూడా నానీ నచ్చుతున్నాడు. ఇతర రాష్ట్రాల వాళ్ళయిన ఆ హీరోయిన్స్‌కి నానీ మంచి హాస్పిటాలిటీ ఇస్తున్నాడట. హీరోయిన్స్ అందరితోనూ……కొంతమంది యంగ్ హీరోలతోనూ నానీ ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటెయిన్ చేస్తున్నాడు. హీరోయిన్స్‌తో నానీ మెయింటెయిన్ చేసిన ఆ సత్సంబంధాలే ఇప్పుడు తను నిర్మాతగా మారి తీస్తున్న ‘అ…’ సినిమా విషయంలో చాలా హెల్ప్ అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి, సినిమా ప్రమోషన్స్‌కి హెల్ప్ అవడానికి చాలా మంది హీరోయిన్స్ సదా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నానీ కెరీర్‌కి ఇలాంటి మంచి రిలేషన్స్ కచ్చితంగా హెల్ప్ అవుతాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -