Thursday, May 16, 2024
- Advertisement -

‘మ‌న‌సుకు న‌చ్చింది’ రివ్యూ

- Advertisement -

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసురాలు, ప్రిన్స్ మ‌హేశ్‌బాబు సోద‌రి మంజుల చాలా రోజుల త‌ర్వాత మైక్ ప‌ట్టారు. గ‌తంలో ఓ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మంజుల తరువాత నటిగా, నిర్మాతగా మారి బిజీ అయ్యారు. ఇప్పుడు తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పైగా వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న సందీప్ కిష‌న్‌తో ఆమె తీసిన సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిందో లేదో.. చూద్దాం! ఈ సినిమాకు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ అందించడంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మంజుల దర్శకురాలిగా మెప్పించారో లేదో చూద్దాం!

కథ : సూరజ్ (సందీప్‌ కిషన్‌), నిత్య (అమైరా దస్తర్‌) ఒకే కుటుంబంలో కలిసి పెరిగిన స్నేహితులు. అయితే వీరి స్నేహాన్ని ప్రేమగా భావించిన వాళ్ల కుటుంబ‌స‌భ్యులు వీరిద్ద‌రికి పెళ్లిచేయాలని నిర్ణయిస్తారు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్‌, నిత్య భావిస్తుంటారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రూ ఇంట్లో నుంచి పారిపోతారు. త‌మ స్నేహితుడు శరత్ (ప్రియదర్శి) స‌హాయంతో గోవాలో ఉంటారు. ఇక్క‌డి నుంచి త‌ర్వాత సూర‌జ్ త‌న కెరీర్‌ను బాగు చేసుకోవాల‌ని చూస్తాడు. త‌ను ఫొటోగ్రాఫర్‌ కావాలని నిర్ణయించుకుని ప్ర‌య‌త్నాలు చేస్తాడు. సూర‌జ్ విఫ‌ల‌మ‌వ‌డంతో నిత్య ధైర్యం చెప్పడంతో రాణిస్తాడు. అయితే నిత్యకు సూరజ్‌పై ప్రేమ పుట్టుకొస్తుంది. గోవాలో సూర‌జ్‌కు నిక్కి (త్రిదా చౌదరి) ప‌రిచ‌య‌మ‌డంతో ఇష్టపడతాడు. అదే సమయంలో అభయ్‌ (అదిత్‌ అరుణ్‌) అనే వ్య‌క్తి నిత్యను ఇష్టపడతాడు. ఈ విధంగా ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌డంతో సూర‌జ్‌, నిక్కి, నిత్య‌- అభ‌య్‌కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే చివ‌రికి పెళ్లి ఎవ‌రెవ‌రికి అవుతుందో తెలియాలంటే సినిమా చూడాలి..

దర్శకురాలిగా మంజుల తొలి ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. రొటీన్ స్టోరీని ‘నేచర్‌’ అనే ఎలిమెంట్‌ను జోడించారు. కథలో కొత్తదనం లేదు.. పైగా కథనం కూడా నెమ్మది సాగుతుంది. ప్రేక్షకుడికి విసుగు తెప్పించేలా ఉంటుంది. అయితే సినిమాలో మెచ్చుకోద‌గ్గ విష‌యం సినిమాటోగ్రఫి. గోవా ప్రకృతి అందాలను సినిమాలో అందంగా చూపించారు. రధన్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు బాగున్నాయి.

సందీప్‌ కిషన్ తన ప‌రిధి మేర‌కు నటించారు. అయితే భావోద్వేగాలు ప‌లికించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. త‌న‌కు అల‌వాటైన యూత్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాల్లో సందీప్‌ నటనలో మెరుగు కావాల‌ని అనిపిస్తుంది. అమైర దస్తర్‌ అందంతో ఆకట్టుకోవ‌డంతో పాటు నటనలో మంచి మార్కులు కొట్టేసింది. త్రిదా చౌదరి గ్లామర్‌కే పరిమితమైంది. ప్రియదర్శిని హీరో ఫ్రెండ్‌ పాత్రకు సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇతర పాత్రలు పెద్దగా తెర మీద కనిపించవు. అదిత్‌ అరుణ్‌, నాజర్‌, సంజయ్‌, అనితా చౌదరి ప‌ర‌వాలేద‌నిపించారు.

న‌టీన‌టులు : సందీప్‌ కిషన్‌, అమైరా దస్తర్‌, త్రిదా చౌదరి, అదిత్‌ అరుణ్, బేబీ జాన్వీ
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
సంగీతం : రధన్‌
నిర్మాత : సంజయ్‌ స్వరూప్‌, పి.కిరణ్‌

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -