- Advertisement -

ప్రశాంత్ వ‌ర్మ‌తో రెబల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్టు!

- Advertisement -

పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను తన కటౌట్‌తో షేక్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్‌లో ఎన్నో భారీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ల క్రితం అనౌన్స్ అయ్యి.. మధ్యలో ఎలాంటి చప్పుడు లేకపోవడంతో అందరూ మర్చిపోయిన ఒక మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రభాస్.. అలాగే కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ కలయికలో రాబోతున్న ఆ క్రేజీ ప్రాజెక్టుపై సరికొత్త అప్‌డేట్ రావడంతో సరికొత్త చర్చ మొదలైంది.

ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా హోంబళే ఫిల్మ్స్ వేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. గతంలో ఇదే హోంబళే సంస్థ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ వర్మ సిద్ధం చేయబోతున్న ఒక కొత్త అద్భుతాన్ని ప్రపంచానికి చూపించేందుకు తాము ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉన్నామంటూ హోంబళే మేకర్స్ తమ పోస్ట్‌లో అధికారికంగా హింట్ ఇచ్చారు. దీంతో ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబో దాదాపు ఖరారైపోయినట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ చిత్రంతో పాటు తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) లోని ఇతర సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. భారతీయ పురాణాలను.. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌ను కలపడంలో దిట్ట అయిన ప్రశాంత్ వర్మ.. ప్రభాస్ లాంటి కటౌట్‌ను ఎలాంటి కథతో చూపిస్తారోనని మెగా ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడే ఊహించుకుంటున్నారు. టాలీవుడ్, శాండల్‌వుడ్ కలయికలో రాబోతున్న ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -