Sunday, May 19, 2024
- Advertisement -

రుక్మిణీదేవీగా రీతూ వర్మ..

- Advertisement -

పెళ్లిచూపులు సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన నటి రీతూ వర్మ. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో మంచి అవకాశాలతో ముందుకుసాగుతున్నారు. ఇక ఇవాళ రీతూ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తూ మేకర్స్ విషెస్ తెలిపారు.

శ్రీవిష్ణుతో దర్శకుడు హసిత్ గోలి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు స్వాగ్ అనే టైటిల్ ఖరారు చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది,. రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మణీదేవికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -