Monday, May 20, 2024
- Advertisement -

మ‌ళ్లీ పాప‌గా మారిన హీరోయిన్‌

- Advertisement -

త‌న చిన్న‌త‌నాన్ని ఓ హీరోయిన్ గుర్తు చేసుకుంది. త‌న చిన్న‌ప్ప‌టి ఫొటోను అభిమానుల‌తో పంచుకుని ఆ ఫొటోకు త‌న‌తో ఉన్న అనుబంధాన్ని వివ‌రించింది. మ‌ళ్లీ పాపగా హీరోయిన్ మారి ఆ ఫొటో ముచ్చ‌ట చెప్పింది. ఆ హీరోయిన్ రెజీనా. త‌న చిన్న‌ప్పుడు ఉన్న ఒక ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది. నోట్లో వేలు పెట్టుకొని ముద్దు ముద్దుగా కనిపిస్తున్నపాపగా హీరోయిన్ రెజీనా ఉంది.

తన చిన్నతనంలో స్కూల్‌లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఈ డ్రెస్‌తో పాల్గొన్నప్పుడు తీసిన ఫొటో ఇది అని చెప్పింది. అప్పుడు తనకే మొదటి బహుమతి వచ్చిందని పేర్కొంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రెజీనా.

‘ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉంటే వాళ్ల అమ్మ త‌న‌ను బాగా ముస్తాబు చేసేది. ఇక్కడ బాక్స్‌లో బొమ్మలా కనిపిస్తున్న నేను మా అమ్మకు చిట్టి బొమ్మను. మళ్లీ పాపనైతే బాగుండు అనిపిస్తోంది. ఇదే కాదు మరో ఫాన్సీ డ్రెస్ ఫోటో కూడా ఉంది. వెతికి పట్టుకొని ఆ ఫోటో కూడా షేర్ చేస్తా. అందులో సగం కుమార్తెలా, సగం కుమారుడిలా కనిపిస్తా’ అని చెబుతూ ఆస‌క్తిక‌రంగా రెజినా పోస్ట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -