Monday, April 29, 2024
- Advertisement -

మూడో సినిమాపై తేల్చుకోలేక‌పోతున్న అఖిల్

- Advertisement -

హ‌లో సినిమాతో అక్కినేని రెండో వార‌సుడు తొలి విజ‌యం అందుకున్నాడు. విడుద‌లైన సినిమా థియేట‌ర్ల‌లో బాగానే ఆడుతోంది. దీంతో తండ్రి అక్కినేని నాగార్జున కుమారుడిని విజ‌యం అందించ‌డంలో చేసిన కృషి ఫ‌లించింది. తొలి విజ‌యంతో ఆనందంలో ఉన్న అఖిల్ త‌న త‌ర్వాతి సినిమాపై ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాడు. హ‌లో సినిమా క‌న్నా మంచి విజ‌యం పొంద‌డానికి ఆలోచిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను ప్ర‌య‌త్నిస్తున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుల‌తో సినిమా చేయాల‌ని భావిస్తున్నాడు.

యువ హీరో త‌న త‌ర్వాతి సినిమా ఎలా చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నా. రెండో సినిమా హ‌లో చేయడానికి అఖిల్ రెండేళ్లు తీసుకున్నాడు. మరి మూడో సినిమాకు ఎంత స‌మ‌యం తీసుకుంటాడో చూడాలి. ఇప్ప‌టికైతే ఏ సినిమాలు అఖిల్ చేతిలో లేవు. ఇప్ప‌టి నుంచి చ‌ర్చ‌లు ప్రారంభించి సెట్స్‌పైకి వెళ్లి థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి 2018 పూర్తి కావాల్సిందే.

ఒక మంచి బాక్స్ ఆఫీస్ హిట్టు కొట్టే సినిమా చేయాలని అనుకుంటున్నాడు. దీనికోసం నాగార్జున కొంతమంది దర్శకులతో చర్చలు జరిపినట్లు స‌మాచారం. సుకుమార్ – కొరటాల శివల‌తో మొద‌ట చేయాల‌ని భావించారు. సుకుమార్ అఖిల్‌కు తగ్గట్టుగా ఒక ప్రేమ క‌థను రాసుకున్నాడ‌ట‌.అయితే ఇప్పుడు వారిద్ద‌రూ కాదు కోలీవుడ్ ద‌ర్శ‌కుడు అట్లీతో చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇటీవల అట్లీ తీసిన సినిమా మెర్సల్. ఇది ఎన్ని వాగ్వాదాలు లేపిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా విజ‌యం సాధించింది. తెలుగులో అదిరింది పేరు మీద డ‌బ్బింగ్ సినిమా విడుద‌లైంది. అట్లీ అఖిల్‌తోనే ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయడానికి సన్నాహాకాలు చేస్తోంది.

https://www.youtube.com/watch?v=QPmXTScbmK0

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -