Tuesday, May 14, 2024
- Advertisement -

మళ్లీ పవన్ తండ్రి అవ్వడంపై.. రేణు స్పందన ఇదే..?

- Advertisement -

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు తెగ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పవన్ తో విడిపోయిన తర్వాత మళ్లీ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కలుగజేసుకొని.. అలా చేయొద్దు అని రేణుకి చెబుతున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన ఆమె.. మగాళ్లు ఎన్ని పెళ్లిలు చేసుకున్న పర్వాలేదు.. కానీ ఆడవాళ్లు మాత్రం ఒకే పెళ్లి చేసుకోవాలా అని ఆమె ప్రశ్నించింది.

ఆమె ఆరోగ్యం బాలేని సమయంలో తనకంటూ ఓ తోడు ఉంటే బాగుండు అనిపించిందని.. ఆ టైంలో ఎవరు లేని నా భాద చాలా బాధకారం అని ఆమె తెలిపింది. తనకంటూ ఓ మనిషి తోడు ఉంటే తన ఆరోగ్యం బాలేనప్పుడు దగ్గర ఉండి చూసుకునేవాడు కదా… పిల్లలను కూడా చూసుకునేవాడు కదా.. అందుకే తనకు ఓ తోడు కావాలని అనిపించిందని ఆమె తెలిపింది. ఈమె ఈ విధంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే.. తాజా పవన్ కు సంబంధించిన వార్త ఒక్కటి అభిమానులను సంతోష పెడుతోంది. పవన్ రేణుతో విడిపోయాక రష్యన్ లేడి అన్నా లెజినావోని మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరికి పొలేనా అనే పాప కూడా ఉంది. ఇప్పుడు మరోసారి పవన్ తండ్రి అయ్యారు. ఈ వార్త పవన్ ఫ్యాన్స్ ను తెగ ఆనంద పెడుతోంది.

ఇప్పుడు రేణు ఇదే విషయంపై స్పందించారని.. ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పవన్ కొడుకు చాలా బాగున్నాడని.. ముద్దుగా ఉన్నాడని.. ఆమె తన సన్నిహితుల వద్ద పవన్ కొడుకు గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎంతైన పవన్ కొడుకు కదా.. ఆ మాత్రం మాట్లాడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇక రేణు బుల్లితెరపై ఓ షోలో జడ్జ్ గా చేస్తుండగా.. ఇక పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -