Friday, May 17, 2024
- Advertisement -

కాట్రవల్లి ఫుల్ సపోర్ట్ .. జనసేనుడికేనా

- Advertisement -

కాట్రవల్లి, ఎంద చేట ఆలీ…. టీవీ కిచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విశేషాలు చెప్పాడు. అయితే ఆలీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎక్కువగానే వచ్చింది. త్వరలో పవన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారని ఇందుకు తగ్గట్లుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మీ బాస్ పవన్ తో పాటు మీరు కూడా వెళతారా అన్న ప్రశ్నకు సూటిగా చెప్పకుండా గోదావరి జిల్లాల లౌక్యాన్ని ప్రదర్శించాడు.

ఏనాడు పవన్ తనని పార్టీలోకి రమ్మని గాని ఎవరు తనని పనిచేయమని అడగలేదని ..మంచైనా, చెడైనా ఏదైనా తానే భరిస్తానన్నదే పవన్ సిద్ధాంతమని చెప్పుకొచ్చాడు. ఆలీ మాటలు చూస్తుంటే పవన్ మీద అభిమానాన్ని చూపిస్తూనే.. తాను టీడీపి మనిషిననే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాడు. గతంలో రాజమండ్రి నుంచి ఎమ్ పి గా పోటీ చేయడానికి ఆ స్థానం కోసం చాలా ట్రై చేశాడు.

మురళీ మోహన్ లాబీయింగ్ ముందు ఆలీ నిలబడలేక కామ్ అయిపోయాడు. కాని ఎప్పటికైనా టీడీపీ ద్వారా ఎమ్.పి. గా డిల్లీలో అడుగు పెట్టాలని ఆలీ భావిస్తున్నట్లుగా పై స్థాయిలో చెపుకుంటున్నారు. మైండ్ లో ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు ఇక ఆలీ ఏవిధంగా జనసేనలోకి వెళతాడు. ఏ విధంగా పవన్ ఆలీని తనతో రమ్మంటాడు చెప్పండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -