Thursday, April 25, 2024
- Advertisement -

ఆద్య డ్యాన్స్.. ఆనందంతో నవ్వులు పూయిస్తున్న రేణు దేశాయ్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో బద్రి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి అకిరా, ఆద్య జన్మించారు. కొన్ని కారణాల వల్ల పవన్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. అయినా వీరి కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే సోషల్ మీడియాల్ ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్.. తన సంతోషాలు, బాధలు అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా రేణూ దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్టు చేసింది. సిగ్గుపడుతూ, నవ్వుతూ ఓ వీడియో తీసుకుని దాన్ని పోస్ట్ చేసి, ఆ నవ్వుకు కారణం ఏంటో త్వరలోనే చెబుతానని సస్పెన్స్ లో పెట్టింది. తన తల్లి ఆనందంలో మునిగిపోతూ నవ్వుతుంటే.. కూతురు ఆద్య డ్యాన్స్ చేస్తుంది. నేను ఇలా ఎందుకు న‌వ్వుతున్నానో తెలుసుకోవాలంటే వేచి చూడండి’ అని ఆమె పేర్కొంది.

‘ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా. నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావె పిల్లిమొగ్గలేసిందిలా.. గాలుల్లో నీ వాసన…’ అనే పాటకు రేణు దేశాయ్ తన అందమైన నవ్వులు చిందిస్తుంది. అయితే ఆమె చెప్పబోయే విషయం ఏంటనే విషయంపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -