- Advertisement -

గుడి నిర్మాణానికి పాక్ ప్రధాని అనుమతి..!

- Advertisement -

పాకిస్థాన్​ రాజధాని ఇస్లామాబాద్​లో హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇస్లామిక్​ వర్గాలు ఒత్తిడి చేయడం వల్ల ఆరు నెలలుగా నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించవచ్చంటూ రాజధాని అభివృద్ధి అధికార యంత్రాంగం అనుమతులు జారీ చేసింది.

20వేల చదరపు అడుగుల స్థలంలో శ్రీకృష్ణుడి దేవాలయాన్ని నిర్మించేందుకు హిందూ పంచాయత్​కు 2017లోనే అనుమతి లభించినప్పటికీ పలు కారణాలు వల్ల నిర్మాణ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. దేవాలయంతో పాటు పక్కనే ఉన్న హిందూ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మాణానికి కూడా తాజాగా అనుమతించింది. అధికారిక గణాంకాల ప్రకారం సుమారు 75 లక్షల మంది హందువులు పాకిస్థాన్​లో నివాసముంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -