Wednesday, May 15, 2024
- Advertisement -

రీరిలీజ్ అయిన రౌడీ బాయ్ సినిమా

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా, భారత్ కమ్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్స్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా చాలా స్లోగా ఉందని రన్ టైం బాగా ఎక్కువైంది అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. రెండు గంటల యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగా స్లో అయిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా లోని కొన్ని సీన్లను కట్ చేసి నిన్న సాయంత్రం సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు.

13 నిమిషాల రన్ టైం తగ్గించారట. అంతేకాకుండా క్యాంటీన్ పాటని కూడా సినిమా లో యాడ్ చేశారు. ప్రస్తుతం ఆ పాట యువత దృష్టిని బాగానే ఆకట్టుకుంటోంది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ‘డియర్ కామ్రేడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద నంబర్లను నమోదు చేసుకోలేదు. దీనికి కారణం వర్డ్ ఆఫ్ మౌత్ ఏమాత్రం బాగోక పోవడం. మరి ఇప్పుడు చాలావరకు సన్నివేశాలను కట్ చేసేశారు. మరి ఇప్పుడైనా ‘డియర్ కామ్రేడ్’ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటుందో లేదో చూడాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -