తెలుగు సినిమా పరిశ్రమ లో చాలా రొటీన్ సినిమాలు తీసి కమర్షియల్ హిట్ కొట్టాలనే ఆలోచన చేసి ప్రతీ సారీ ప్లాప్ అవుతున్న కుర్ర హీరో ఎవరూ ? అంటే తక్కువ హీరో రాం పేరే గుర్తొస్తుంది.
అలాంటి రాం పూర్తిగా ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ తో హిట్ కొట్టడం కోసం చేసిన ప్రయత్నమే ఈ ‘నేను శైలజ’ పోయిన సంవత్సరం పండగ చేస్కో సినిమా తో కమర్షియల్ గా పరవాలేదు అనిపించుకుని శివం తో మళ్ళీ పూర్ ఫార్మ్ పొందాడు రాం ఈ ఏడాది కొత్త డైరెక్టర్ తో కొత్తగా సంవత్సరం మొదటి రోజునే థియేటర్ లలో అడుగుపెట్టిన రాం ఏ మేరకు విజయం సాధించాడో చూద్దాం.
స్టొరీ – పాజిటివ్ లు
హరి (రాం) కి చిన్న తనం నుంచీ లవ్ ఫైల్యూర్ లు ఎక్కువ ఎప్పుడు ప్రేమలో పడినా ప్రేమలో పడదాం అనుకున్నా అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి పాపం. అలా అలా పెద్దవాడు అయ్యి ప్రేమ మీద చిరాకు వచ్చేసే సరికి శైలజ (కీర్తి) ని కలుసుకుంటాడు. ఆమె మీద తొలి చూపులోనే ప్రేమ కలిగినా కూడా ప్రేమ విషయం లో అతని దరిద్రం గురించి అతనికి ఉన్న ఎక్స్ పీరియన్స్ ని బట్టి చూసుకుని ఆమె కి తన ప్రేమ చెప్పకుండా ఉండడమే సబబు అనికుని ఆమె మీద తనకి ఉన్న ఫీలింగ్స్ అన్ని చంపేసుకుంటూ ఉంటాడు. వారిద్దరూ చిన్న నాటి స్నేహితులు అని తెలుసుకున్నాక ఇంక ఉండబట్టలేక అందరి సలహా మేరకు ఆమెకి ప్రపోజ్ చేసేస్తాడు హీరో. ఎప్పటి లాగానే ఆమె కూడా రాం కి నో చెబుతుంది. మిగిలిన సినిమా అంతా ఆమె ఎందుకు నో చెప్పింది ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది. ఆమె కి అతని మీద ప్రేమ లేదా ? చిన్న నాటి స్నేహితురాలు – ఇప్పటి ప్రేయసి అయిన శైలజ మనసు ఎలా గెలుచుకున్నాడు అనేది మిగిలిన సినిమా. రాం యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసాడు , పక్కింటి కుర్రాడి పాత్రలు చెయ్యడం రాం కి కొత్తేమీ కాదు తన కెరీర్ లో అలంటి పాత్రలు అలవోకగా చేసి పారేసాడు రాం. కామెడీ టైమింగ్ లో కూడా రాం ఒక మెట్టు ఎదగడానికి ఈ సినిమా తోడ్పతుతుంది. ఈ సినిమా లో ప్రదీప్ రావత్ ని విలన్ గా కాకుండా కమెడియన్ గా చూపించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అతని సీన్ లు పిచ్చ కామెడీ ఇచ్చి సినిమా కే హై లైట్ గా నిలిచాయి. సత్య రాజ్ మంచి పాత్ర చెయ్యగా హీరోయిన్ పరవాలేదు అనిపించింది. వంశి కృష్ణ నెగెటివ్ పాత్రలో ఓకే అనిపించాడు. డైరెక్టర్ ఈ ప్రేమకథని మలచిన తీరు , స్క్రీన్ ప్లే పెద్ద విశేషంగా చెప్పాలి. చాలా చూసేసిన సన్నివేశాలు అనిపించినా అవి కూడా కాస్త కొత్తగా తీసాడు . కామెడీ అవసరమైన చోట్ల పెట్టి మెప్పించాడు. డైలాగులు చాలా బాగా రాసారు.
నెగటివ్ లు
కథ రొటీన్ గా లేదు కానీ చాలా చోట్ల సీన్ లు రొటీన్ గా అనిపిస్తాయి. ముందుగానే ఊహించదగ్గ సీన్ లు చూడడానికి ఏ ప్రేక్షకుడూ సిద్దంగా ఉండదు అని డైరెక్టర్ అర్ధం చేస్కోవాల్సింది. దేవీ మ్యూజిక్ ఎంత బాగుందో పాటలు అంత అద్భుతంగా రాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కాస్త జాగ్రత్త పడాల్సింది . ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కాస్త స్లో అనే చెప్పాలి . కామెడీ ని లాగినంత పర్ఫెక్ట్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ ని లాగలేక పోయారు. సినిమాలో సెంటిమెంట్ పాళ్ళు మరీ ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో. హీరోయిన్ కూడా ఒకరకంగా మైనస్ అనే చెప్పాలి . ఎడిటింగ్ ఇంకా బాగుండాలి.
మొత్తంగా .. నేను నా శైలజ సినిమా రాం తో పాటు తెలుగు సినిమాకి కూడా నూతన సంవత్సరం మొదటి రోజున వచ్చిన సూపర్ హిట్ సినిమా గా చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ స్లో అయినా డైరెక్టర్ కామెడీ తో దాన్ని పూర్తిగా కవర్ చేసేసాడు. అనవసర క్యారెక్టర్ లూ, అక్కర లేని సీన్ లూ, ఫోర్స్ కామెడీ లేకుండా సినిమా చాలా క్లీన్ గా సాగుతుంది. ఫామిలీ తో ఈ వారాంతంలో వెళ్ళదగిన ఒక పర్ఫెక్ట్ సినిమా గా నేను శైలజా ని ప్రకటించవచ్చు. రాం ఇలాంటి కొత్త కథలు ఎంచుకుని ఫ్యూచర్ లో ఇక రొటీన్ వైపు వెళ్ళకుండా డీసెంట్ హిట్ లు కొట్టాలి అని ఆశిద్దాం.