Thursday, May 16, 2024
- Advertisement -

నాగ్ ఆఫీస‌ర్‌కి సెన్సార్ లైన్ క్లియ‌ర్‌….

- Advertisement -

కింగ్ నాగార్జున – ఆర్జీవీ కాంబోలో నాల్గవ మూవీ ‘ఆఫీసర్’ సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్’‌ని కర్ణాటకకు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా రూపొందించారు వర్మ.

సుమారు 28 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ చిత్రం టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఈమూవీలో స్టూడెంట్ లీడర్.. సైకిల్ చైన్ లాగే సీన్ ఓ సంచలనం. ఆ మూవీ తరువాత అంతం, గోవింద గోవింద చిత్రాలు వచ్చాయి. లాంగ్ గ్యాప్ తరువాత నాగార్జున హీరోగా వర్మ కంపెనీ నుండి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

చాలా కాలం తరువాత వర్మ .. నాగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వలన, ‘శివ’ను మించినదిగా ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడం వలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి వుంది. శివ త‌ర్వాత గోవింద గోవింద చిత్రాలు వచ్చాయి. లాంగ్ గ్యాప్ తరువాత నాగార్జున హీరోగా వర్మ కంపెనీ నుండి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

కర్ణాటకకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగిందని చెప్పడం వలన అందరిలో ఆత్రుత పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందని భావిస్తున్నారు. జూన్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -