Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ పై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

- Advertisement -

ఆయన మాట్లాడితే సంచలనమే… వివాదాస్పదమో.. ! ఏదైనా ఫుల్ క్లారిటీతో మాట్లాడే తనకు.. జీవితంలో మొదటి సారి మాటలు కరవయ్యాయన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని రాజమౌళి ని పొగడతలతో ముంచెత్తారు. ట్రిపుల్ ఆర్ తనలో చిన్నపిల్లాడిని బయటపెట్టిందన్నారు. ఫేమస్‌, స్టేటస్‌.. ఇలా అన్నీ మర్చిపోయానని… ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేస్తూ సినిమా చూశానన్నారు.

ట్రైలర్ చేసినప్పుడు బాగుంటుంది అని అనుకున్నానని… ఇదొక అద్భుతమైన చిత్రమని చూశాకా తెలిసిందన్నారు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. కథ చెప్పిన విధానం, విజువల్‌గా స్క్రీన్‌పై చూపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుందన్నారు.

30ఏళ్లలో ఇంతలా ఏ చిత్రాన్ని ఎంజాయ్ చేయలేదన్నారు. రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం అంటూ వర్మ ప్రశంసించారు. నీలాంటి వ్యక్తి ఈ భూమ్మీదకు వచ్చి.. సినిమానే కలగా చేసుకుని.. దర్శకుడిగా మంచి చిత్రాలు తెరకెక్కిస్తున్నందుకు సినీ ప్రియులందరూ ఎంతో ఆనందిస్తున్నారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -