Sunday, May 5, 2024
- Advertisement -

పవన్ పొలిటికల్ కెరీర్ ఖతం అంటున్న ఆర్జీవీ!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పూర్తిగా చతికిలపడిపోయింది. పోటీ చేసిన 8 స్థానాల్లో డిపాజిట్ కొల్పోవడమే కాదు కనీసం చెప్పుకోదగ్గ ఓట్లను కూడా సాధించలేకపోయింది. దీంతో జనసేన పని ఖతం అయిపోయినట్లు అంతా భావిస్తుండగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…పవర్ స్టార్‌కు కీలక సూచన చేశారు.

పవన్ కల్యాణ్ సార్… మీ నిజమైన అభిమానిగా ఒక సలహా ఇస్తున్నాను… మీకు అంత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని వెంటే దూరం పెట్టేయండని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్.ఎం, ఆర్కే వంటి వారు మీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు ఇక అదే సమయంలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డిని బాహుబలితో పోల్చారు ఆర్జీవీ.

వాస్తవానికి పవన్‌పై ఆర్జీవీ సెటైర్లు వేయడం, చురకలు అంటించడం ఇది కొత్త కాదు…భవిష్యత్‌లో చేయడని కాదు. సినిమా అయినా, రాజకీయం అయినా పవన్‌ని టార్గెట్‌ చేసే వారిలో ముందంజలో ఉంటారు వర్మ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -