Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబుకు దెబ్బేసిన సెటిలర్లు!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో టీడీపీ, చంద్రబాబు అండ్ కోకు తీవ్ర నిరాశే ఎదురైంది. బయటికి చెప్పకపోయిన ఇంటర్నల్‌గా కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది టీడీపీ. ఇక సెటిలర్లు అంతా తమ వైపే ఉన్నారనే ధీమాతో ఉన్న టీడీపీకి ప్రస్తుతం జరిగిన తెలంగాణ ఎన్నికలతో కళ్లు తెరుచుకున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని సెటిర్లంతా కారుకే జై కొట్టారు. దీంతో బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో మెజార్టీ సీట్లు సాధించింది. ప్రధానంగా శేరిలింగంపల్లి,కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ గెలుపుకు సెటిలర్లు దోహదపడతారని భావించిన ఈ మూడు స్థానాల్లో భారీ విజయాన్ని నమోదుచేసింది బీఆర్ఎస్. ఇక రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా కుత్బుల్లాపూర్ వివేకానంద గౌడ్ నిలిచారు. 85 వేల మెజార్టీ ఈ నియోజకవర్గంలో రాగా కూకట్ పల్లిలో 78 వేల మెజార్టీ సాధించారు మాధవరం కృష్ణారావు.

ఇక గ్రేటర్‌తో పాటు రంగారెడ్డి పరిధిలోని సెటిలర్లు అంతా బీఆర్ఎస్‌ వైపే నిలిచారు. దీంతో కాంగ్రెస్ – టీడీపీ నేతలకు భంగపాటు తప్పలేదు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సత్తా చాటి దానిని ఏపీలో విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు భావించిన ఫలితాల తర్వాత ఆ మాటే ఎత్తడం లేదు. ఇక పవన్ సంగతి చెప్పనక్కర్లేదు. సత్తా చాటడం సంగతి పక్కనపెడితే కనీస పోటీ కూడా ఇవ్వలేదు జనసేన. దీంతో తెలంగాణ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ, జనసేనలకు ఏపీలోనూ భంగపాటు తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -