Sunday, April 28, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ కు ఆ ఒక్కటీ నచ్చలేదట

- Advertisement -

భీమ్లా నాయక్ ట్రైలర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అప్ లోడ్ అయిన 7 నిమిషాల్లోనే 200K లైక్స్తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టాక్తో సంబంధం లేకుండా ఎప్పటిలాగే పవన్ ట్రైలర్ యూట్యూబ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో ట్రైలర్ నిరాశపరిచిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ని ఇంత పూర్గా ఎలివేట్ చేస్తారా.. ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసిందంటూ సోషల్ మీడియాలో పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) ఫ్యాన్స్ని ఎక్కువగా నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్లో చాలామంది ఫ్యాన్స్ బీజీఎం బాగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీజీఎం అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. అసలు తమన్ మార్క్ కనిపించలేదని… బీజీఎం చాలా స్లోగా ఉందని కొందరు కామెంట్ చేశారు.

మరికొందరు సినిమా మేకర్స్పై విరుచుకుపడ్డారు. ట్రైలర్ వాయిదా వేయడంపై ఉన్న శ్రద్ధ బీజీఎంపై పెట్టి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు. ట్రైలర్ కట్ బాగోలేదని.. దీనికన్నా ఫ్యాన్స్ ఎడిటింగ్ బాగుటుందని నెటిజన్లు కామెంట్ చేశారు.ఇక భీమ్లా నాయక్ ట్రైలర్పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ట్రైలర్ చూశాక.. భీమ్లా నాయక్ టైటిల్ కంటే డానియెల్ శేఖర్ అనే టైటిల్ పెట్టి ఉండాల్సిందని కామెంట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫిల్మ్ సిర్కిల్‌ గా చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బోల్డ్ బ్యూటీ

మరోసారి సెంటిమెంట్ ఫాలోఅవుతున్న త్రివిక్రమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -