Sunday, May 19, 2024
- Advertisement -

ట్రైలర్ సూపర్ః వర్మ నిజంగానే ఈ సారి సూపర్ సినిమా తీశాడా..?!

- Advertisement -

ఫలితాలతో సంబందం లేకుండా సినిమాలు చేసుకొంటూ పోతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వైపు వచ్చినప్పటి నుంచి వర్మలో ఈ దురద మరింతగా పెరిగింది. రక్త చరిత్రతో మొదలు..

చాలా సినిమాలు వర్మ తీస్తూనే ఉన్నాడు. నిర్మాతగా, దర్శకుడిగా ఒకదాని తర్వాత మరోదాన్ని రూపొందిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలో కొన్ని సినమాలు మాత్రమే పర్వాలేదు.. బాగున్నాయి.. అనిపించుకొన్నాయి. 

ముంబై దాడుల గురించి తీసిన సినిమా, హేట్ స్టోరీ వంటి సినిమాలు మాత్రమే పర్వాలేదనిపించుకొన్నాయి. మిగతావన్నీ గాలి సినిమాలే. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ వర్మ “కిల్లింగ్ వీరప్పన్” ను రూపొందించాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను హీరోగా పెట్టి గంధపు చెక్కల స్మగ్లర్ ను హతం చేయడంపై సినిమాను రూపొందించాడు. ఇందుకు సంబంధించి ట్రైలర్ విడుదల అయ్యింది.

ఈ ట్రైలర్ అయితే పర్వాలేదనిపిస్తోంది. వీరప్పన్ కసాయితనం గురించి.. అతడిని అడ్డుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసిన యత్నాల గురించి వర్మ ఈ ట్రైలర్ లో వివరించాడు. బిన్ లాడెన్ ను పట్టి పంచడానికి అమెరికాకు పదేళ్లు పట్టాయి.. వీరప్పన్ ను పట్టుకోవడానికి మాత్రం 20 సంవత్సరాలు పట్టాయని వర్మ ట్రైలర్ లో వేశాడు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా సాగిన ఈ ట్రైలర్ వర్మ అభిమానులను అయితే ఆకట్టుకొంటోంది. మరి సినిమాగా ఇది సగటు సినీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకొంటుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -