Saturday, May 18, 2024
- Advertisement -

ఆ సినిమా మార్కెట్ కోసం.. వర్మ, పూరిల చీప్ ట్రిక్స్!

- Advertisement -

ఇప్పటి వరకూ తన సినిమాల విడుదలకు ముందు వివాదాలను సృష్టించి.. ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేసి.. వాటిని మార్కెట్ చేసుకొన్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే నాన్నా పులి..

కథ తిరున వర్మ ఎత్తులతో జనాలు విసుగెత్తిపోయారు. వర్మ ఇలాగే చెబుతూ ఉంటాడు..తీరా సినిమా మాత్రం ఏం బాగుండదు.. అనే అభిప్రాయానికి వచ్చేశారు జనాలు! మరి అయినా వర్మ ఊరికే ఉండటం లేదు. తన తీరున తను ఏదో పోరాడుతున్నాడు. 

మరి ఇప్పుడు వర్మకు ఆ పని చాలా కష్టం అయిపోయింది. తన తాజా సినిమా “365 డేస్’ ను మార్కెట్ చేసుకోవడానికి ఆయన చాలా కష్టాలు పడుతున్నాడు. ఈ సినిమా గురించి రకరకాల కబుర్లు చెబుతూ దానిపై జనాల్లో అటెన్షన్ తీసుకురావడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడు. పెళ్లిని నిరసిస్తూ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

మరి తను అలాంటి సినిమాను తీస్తున్నాను అని చెప్పుకోవడానికి వర్మ శతథా ప్రయత్నిస్తున్నాడు. దీని కోసమని పెళ్లిని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. పెళ్లి వల్ల అనర్థాలే అని తన శిష్యుల చేత చెప్పిస్తున్నాడు. భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవని కూడా పూరి వంటి వర్మ శిష్యులు చెప్పుకొచ్చారు. ఆడవాళ్లూ.. మగవాళ్లూ.. ఇలా ఎవరికి వారు తమ శారీరక అవసరాలను తీర్చుకోవడంతో బంధం ముగిసిపోతుందని.. వారు వ్యాఖ్యానించారు. ఇన్ని వేషాలూ కూడా.. కేవలం ఈ ‘365 డేస్’ మూవీకి ప్రచారం చేసిపెట్టుకొనేందుకే వీరంతా ఇలా మాట్లాడారు.

ఇప్పుడు వర్మ మరో అడుగు ముందుకేసి.. తన వ్యక్తిగత జీవితానుభవాలను కూ ఈ సినిమాకు సంబంధం ఉందని అంటున్నాడు. తను తన భార్యతో విడాకులు తీసుకొన్నప్పటి నుంచి ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నానని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ విధంగా ఆయన తన సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఇన్ని ఎత్తులూ ఒక్క సినిమా కోసం వేస్తోంది వర్మ అండ్ కంపెనీ. మరి ఇంత ప్రయత్నానికీ ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -