Wednesday, May 22, 2024
- Advertisement -

బ్రహ్మ బూట్లతో తంతే వీడు కోట్లలో పడ్డాడు

- Advertisement -

అతను అప్పుడే సింగరేణి నుండి తవ్వి తీసిన బొగ్గులా ఉంటాడు.. చిన్న యాదగిరి గుట్టలా పొట్ట ఉంటుంది. అంటే నలుపుగా ఉండి పొట్ట ఉంటే అందంగా ఉండరా అంటే.. ఉంటారు.. వడివేలు, బాబు మోహన్ గార్లు అందంగా ఉండరా.. ఇలా చాలా మందే ఉన్నారు. ఇది ఇతని కథ. ఇక ఆమె సిమ్లా ఆపిల్ ఎరుపు, ఆంధ్ర మల్లె పువ్వు తెలుపు ఈ రెండు మిక్సైతే ఒక ఖచ్చితమైన రంగు ఉంటుంది..అదే ఆమె మేని చాయ.. అందానికి అందంలా ఉంటుంది.. 

మరి ఈ ఇద్దరికి ఎలా కలిసింది.. ఎక్కడ కుదిరింది.. ఎవడి ఖర్మ కాలిందో.. ఏమో. ఎలా పెళ్ళి చేసుకున్నారు.. ఇలా నా ఆలోచనలు ఆరా తీశాయి.. పెన్ను పరుగెత్తింది.. అతన్ని కలిసాను.. బజన బ్యాచ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లా అతన్ని పొగడ్తలతో ముంచాను.. నోరు విప్పలేదు.. ఇక లాభం లేదు అనుకుని.. వంద మీటింగ్ లు చేయలేని పని ఒక్క మందు బాటిల్ చేయగలదు. 

మ్యాటర్ బయటికి రావాలంటే క్వార్టర్ పడాల్సిందే.. ఇక మ్యాటర్ గడ గడ గడ కక్కేశాడు.. ఆమెది బెంగళూరు.. ఆమె అక్కడ స్టేజీ సింగర్.. అమెకి సినిమాలో పాడటం ఇష్టం, కోట్ల ఆస్తి ఉంది..ఒక్కటే అమ్మాయి.. ఇక ఇతను మనోడే ఇక్కడ కోరస్ పాడుతుంటాడు.. మనిషే కాదు.. గొంతు కూడా బాగోదు.. కానీ అతన్ని చూసి నవ్వుకోడానికైనా మ్యూజిక్ డైరెక్టర్స్ పిలుస్తారు.. కోరస్ సింగర్స్‌కి ఎప్పుడూ work ఉండదు కదా.. so మనోడు Banglooe కి పెయింటింగ్ పని మీద వెళ్ళాడు.. అక్కడ ఈ అమ్మాయిని ఒక స్టేజి మీద చూసి మనసు ఇచ్చేశాడు.. వెళ్ళి మాట్లాడాడు.. నేను తెలుగులో అరెంజర్ ని నాకు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు..కావాలంటే ఇదిగో ఫోన్ నంబర్స్ అని కొన్ని నంబర్స్ చూపించాడు.. 

ఆమె Full happy. హైదరాబాద్‌కి రమ్మన్నాడు.. ok అంది.. కానీ చిన్న problem.. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి వాళ్ళు కాదు. పైగా నువ్వు చూస్తే అందంగా ఉన్నావు.. ఇక నేను వేరే చెప్పాలా… నువ్వే అర్థం చేసుకో అనగానే మరి నేను ఏం చేయాలి.. అంది.. మనం పెళ్ళి చేసుకుందాం .. నువ్వు నా wife అని అంటే ఇక అక్కడ ఎవ్వరూ ఏమీ అనరు..ok నా అనగానే.. ఏదో మందు పెట్టినట్లు పాట కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు.. అనుకుని ok అంది.. ఆమె ఇంట్లో ససేమిరా అన్నారు.. గుడిలో పెళ్ళి చేసుకున్నారు.. అక్కడ 9 రాత్రులు గడిచాయి.. cut చేస్తే హైదరాబాద్ కి వచ్చారు.. ఇక మనోడి తిప్పలు చూడాలి.. కొందరికి దండాలు పెట్టాడు.. కొందరి కాళ్ళు పట్టుకున్నాడు.. ఎలాగో అలాగ ఆమెకి chance లు ఇప్పించాడు.. 

ఇప్పుడు BMW CAR లోతిరుగుతున్నాడు.. అసలు విషయం ఏంటంటే అమెకి తెలుగు రాదు.. మనోడికి కన్నడ రాదు.. మరి వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకున్నారు.. ఏం మాట్లాడుకున్నారు.. వీడి మాటలు ఆమె ఆ రోజు ఎలా అర్థం చేసుకుందో ఇప్పటికి మనోడికి తెలియదు.. ఏమో ఇప్పటికైతే ఇలా సాగుతుంది వీళ్ళ కాపురం.. ఇంతకీ ఎవరా సింగర్.. ఎవరా అరెంజర్ Just Think….    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -