Saturday, May 4, 2024
- Advertisement -

వామ్మో.. ఏపీ ప్రభుత్వ అధికారుల పెన్నులు అంత ఖరీదా!

- Advertisement -

ప్రజల సొమ్మును దుబారా చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. తాము వినియోగిస్తున్నది ప్రజల సొమ్మును అని..

ప్రజల సొమ్ముతో సోకులకు పోతున్నామని గ్రహించకుండా ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. ఏపీ ప్రభుత్వ పెద్దతో సహా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. తాజాగా  ఏపీ ప్రభుత్వ ముఖ్యులందరికీ పెన్నుల కోసం లక్ష రూపాయపై మొత్తాన్ని ఖర్చు పెట్టడం వివాదంగా మారుతోంది.

ఏకంగా 1.11 లక్షల రూపాయలు పెట్టి 500 పెన్నులు కొనాలని నిర్ణయించిందట ప్రభుత్వం. మంత్రులకు, ప్రభుత్వ సలహారులకు.. ఇతర ముఖ్య అధికారులకు ఈ పెన్నులను ఉపయోగించుకొన్నారు. మొత్తం ఐదువందల పెన్నులను కొనడానికి లక్ష రూపాయల మొత్తం నిధులను విడుదల చేశారు. 

మరి దుబారా విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదనేందుకు ఇది మరో రుజువు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలు.. ఇతర మంత్రుల సింగపూర్ , జపాన్ యాత్రల పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇటీవల లోకేష్ బాబు వెంట ప్రభుత్వాధికారులు అమెరికాకు వెళ్లడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ప్రభుత్వం ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది అనే విమర్శలు వచ్చాయి. మరి ఇలాంటి సమయంలో.. ఇప్పుడు పెన్నుల విషయంలో కూడా ఇంత ఖర్చు చేయడం విడ్డూరమే కదా! విమర్శలకు ఆస్కారం ఇచ్చేదే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -