Saturday, May 18, 2024
- Advertisement -

వర్మకు త్వరలో మెగా సన్మానం!

- Advertisement -

రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ ఓ అస్త్రంలా మారిపోయింది.అతను ఎవరి మీద యుద్దం చేయాలనుకున్నా..దానికి ట్విట్టర్ నే వేదికగా చేసుకుంటాడు.గత కొంతకాలంగా మెగా కాంపౌండ్ ను  టార్గెట్ గా చేస్తూ వస్తోన్న వర్మ ఈసారి కాస్త శృతిమించాడు.దీంతో మెగా అభిమానులు వర్మ భరతం పడదామని చూస్తున్నారు.

నిజానికి వివాదాల రామ్ గోపాల వర్మ నిన్న విడుదలైన ‘బ్రూస్ లీ’ సినిమా పై విలక్షణ కామెంట్స్ చేసి మళ్ళీ వార్తలకు ఎక్కాడు. అసలు ఈ సినిమాకు ‘బ్రూస్ లీ’ అని పేరు పెట్టకపోయి ఉంటే ఈసినిమా సూపర్ హిట్ అయి ఉండేదని ఈ సినిమా పై సెటైర్లు వేసాడు.రామ్ చరణ్ నటన బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ టైటిల్ దానికి ప్రాబ్లెమ్ తెచ్చిపెట్టిందనే ఉద్దేశ్యంతో ఏవేవో చెప్పేశాడు.

చిరంజీవి తన 151వ సినిమాలో అయినా ‘బ్రూస్ లీ’ కంటే గొప్పగా కనిపించాలని ఆశిస్తున్నాను అని అంటూ అసలు ‘బాస్ 151వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది?’ అంటూ చిరంజీవి పై మరో సెటైర్ వేసాడు .అలాగే చిరంజీవి తన 150వ సినిమాగా ‘బ్రూస్ లీ’ ని ఎందుకు ఎంచుకున్నాడో ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

 బ్రూస్ లీ సినిమా చూశాక తాను మళ్లీ బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ద డ్రాగన్’ సినిమా చూస్తున్నానని.. మన ‘బ్రూస్ లీ’ని ఆ బ్రూస్ లీ చూస్తే…. ఎలా ఫీలయ్యేవాడో అంటూ బ్రూస్ లీ ఇబ్బందికరంగా ఫేస్ పెట్టిన ఓ పిక్ ను పోస్ట్ చేశాడు. తాను ‘ఆగ్’ సినిమా తీసినపుడు షోలే దర్శకుడు రమేష్ సిప్పీ కూడా ఫీలింగ్ కూడా ఇలాగే ఉండేది అనడం ద్వారా బ్రూస్ లీ మీద తన అభిప్రాయమేంటో చెప్పకనే చెప్పేశాడు వర్మ.

వర్మ చేస్తోన్న ఈ ట్వీట్లతో మెగా ఫ్యాన్ప్ కు చిర్రెత్తుకొచ్చింది.రేపో మాపో మెగా ఫ్యాన్స్  వర్మకు తమదైన శైలిలో సన్మానం చేయాలని చూస్తున్నారట.ఆల్రెడీ దండేసి దన్నం పెట్టేసిన మెగా అభిమానులు నీకుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం విశేషం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -