- Advertisement -

టీఆర్ఎస్ అంటే కేటీఆరేనా?

- Advertisement -

కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలకు అవకాశం కలిగిస్తున్నాయి. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరఫున.. సీఎం కేసీఆర్ కంటే.. తోటి సీనియర్ మంత్రుల కంటే.. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కే. తారకరామారావు.. అన్నీతానై ముందుకు పోతుండడం.. అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది.

దీనికి తోడు.. సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు..  కీలక నాయకుడు, మంత్రి హరీష్ రావు కూడా కొంత కాలంగా సైలెంట్ గా ఉండడం.. ఈ అనుమానాలను మరింత పెంచుతోంది.

త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఖాయమని వార్తలు వస్తున్న ప్రస్తుత సమయంలో.. హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అంతా చూస్తున్నారు. ఈ మధ్య.. ఒకే రోజు 12 ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం కూడా అందరికీ తెలుసు. కానీ.. ప్రతి కార్యక్రమంలో మంత్రి కేటీఆరే హైలైట్ అయ్యారు. ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. మంత్రి హరీష్ రావు కానీ కనిపించడం లేదు. ఇదే టైమ్ లో.. హరీష్ రావు మధ్యప్రదేశ్ టూర్ వెళ్లారు.

 

ఇలా.. ఏ కార్యక్రమం చేసినా.. అవకాశం చూసుకుని మరీ కేటీఆర్ దూసుకుపోతున్న తీరు.. టీఆర్ఎస్ తో పాటు.. ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆలోచన పెంచుతోంది. ఇది ‘ఫ్యూచర్’ కోసమేనా అన్న చర్చ కూడా మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -