Friday, May 3, 2024
- Advertisement -

వర్మ, నాగ్ కాంబో చిత్రం ఎలా ఉంటుందంటే

- Advertisement -

తెలుగు సినిమా శివ ముందు శివ తర్వాత అన్నట్లుగా చెబుతారు.దీనికి కారణం నాగార్జున రామ్ గోపాల్ వర్మలోని క్రియేటివ్ యాంగిల్ ను గుర్తించి సినిమా ఛాన్స్ ఇవ్వడం. ఆయన చలవతో వర్మ అంటూ ఒకడు పబ్లిక్ కు తెలిసాడు. తెలుగు సినిమా దశ దిశను అతడు పూర్తిగా మార్చివేశాడు.

ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో అంతం సినిమా వచ్చింది గాని అది అనుకున్నంత సంచలన సినిమాగా గుర్తింపు తెచ్చుకోలేదు. సినిమాలో సైలంట్ మోడ్ లో నడిచే క్రైమ్ ఆనాటి జనాలకు ఎక్కలేదు. కాని ఎంతో ఇన్ టెన్షన్ ఆ ఫిలింలో ఉంటుంది. అయితే మళ్లీ ఇంతకాలానికి వర్మ నాగ్ లు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.నాగ్ ఫ్యామిళీతో ఫారిన్ ట్రిప్ వేసొచ్చాక ఈ చిత్రముంటుందని స్వయంగా నాగార్జునే చెప్పాడు.

అంతా భాగానే ఉంది కాని వీరిద్దరి కాంబోలో చిత్రమంటే మరో ట్రెండ్ సెట్ క్రియేట్ చేసేది కావాలి. ఆ స్థాయి సినిమాకు కంటెంట్ దొరకాలి.మరి దొరికిందా అంటే నాగ్ స్వయంగా చెబుతున్న దాని ప్రకారం రాము అధ్బుతమైన కథతో నన్ను ఎప్రోచ్ అయ్యాడంటున్నాడు. ఈసినిమాకూడా యాక్షన్ నేపధ్యంలో సాగే చిత్రంగానే కనిపిస్తుంది. ఎమోషనల్‌, కుటుంబ కథా చిత్రాలకు దూరంగా ఈసినిమా ఉండబోతుంది. ఇది కంప్లీట్ స్టైలిష్‌ యాక్షన్‌ ఫిలింగా ఉంటుందని తెలుస్తుంది.

సరిగ్గా నాగ్ ఆశించిననట్లుగానే వర్మ ఓ కొత్త కాన్సెప్ట్‌తో నాగ్ వద్దకు వచ్చాడు. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో రాని జోనర్ తో ఈసినిమా ఉంటుందని తెలుస్తుంది. మల్టిప్లెక్స్ ఆడియన్స్ మెయిన్ టార్గెట్ అయినప్పటికీ… బి,సి సెంటర్లకు నచ్చే విధంగా రాము కథను తయారు చేశాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -