Tuesday, May 21, 2024
- Advertisement -

అక్కడి పోలీసులకు ఇది వరమా..? శాపమా..?

- Advertisement -

సమస్యలనుంచి ప్రజలను బయట పడేయడానికి పోలీసులు ఎప్పుడూ అలర్ట్ గానే ఉంటారు. కాని ఇపుడున్న కాలానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇంకా తీసుకోలేదనుకున్నారో ఏమోదుబాయ్ పోలీసు మరింత అడ్వాన్స్ గా ఆలోచించేశాడు. దానిలో భాగంగానే ఎగిరే బైక్ లను తన రక్షక భటులకు అందిస్తున్నారు. తాజాగా దుబాయ్ …తమ పోలీసులకు ఎగిరే బైకును విజయవంతంగా అభివృద్ది చేసి పరీక్షించి చూపించింది. విధి నిర్వహణ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దుబాయ్ దూసుకుపోతోంది.

దుబాయ్ మాత్రమే కాదు చాలా దేశాలు ఇదే మార్గంలో ఉన్నాయి. పెట్రోలింగ్ కోసం విదేశీ పోలీసులు వాడే టెక్నాలజీలో కేవలం పది శాతం ఇండియా వినియోగిస్తే ఎన్నో మార్పులు తీసుకురావచ్చు దుబాయ్ రక్షక వ్యవస్థలో ఫ్లైయింగ్ బైకులే కాదు, వారి వాహనాలలో ల్యాంబోర్గిని గస్తీ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ రోబోలు, ఆండ్రాయిడ్ ఆఫీసర్లు వీటితో పాటు పర్యవేక్షణ మరియు గస్తీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది.

గగనతలం నుండి గస్తీ కాయడానికి ఎగిరే మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. దుబాయ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగిరే బైకుకు స్కార్పియో అనే
పేరు పెట్టారు. రష్యాకు చెందిన హోవర్‌సర్ఫ్ అనే సంస్థ ఈ స్కార్పియో ఎగిరే బైకును నిర్మించింది. బైకు నలుదిక్కులా నాలుగు ప్రొపెల్లర్స్ మరియు నాలుగు బ్లేడ్లు ఉన్నాయి. మధ్యలో రైడర్ సీట్ ఉంటుంది. ఇది ఎక్కువగా హైవేలపై ఉపయోగపడుతుంది.అయితే ఈ వాహనాలను అదిరోహించి పెట్రోలింగ్ గట్రా చేయడానికి కొందరు పోలీసులు సంకోచిస్తున్నారు. ఉన్నపళంగా ఇంజిన్ మొరాయిస్తే మా పరిస్థితి ఏమిటి అని వారు లబోదిబో మంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -