Thursday, May 2, 2024
- Advertisement -

రెండో రోజు యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న రోబో 2.0 గురువారం విడుద‌ల అయింది.బాలీవుడ్ అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాకు త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో త‌లైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ర‌జినీకి అభిమానులు ఉండ‌టంతో ఈ సినిమాను 10,500 థియేటర్స్ లో విడుదలై కొత్త రికార్డును సృష్టించారు.

మొద‌టి రోజున భారీ క‌లెక్ష‌న్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు మాత్రం యావ‌రేజ్ క‌లెక్ష‌న్లు సాధించింది.సినిమా బాగున్న‌ప్ప‌టికి మ‌న‌కు ఎక్కువ 3డీ థియోట‌ర్లు లేక‌పోవ‌డం 2.0కి పెద్ద దెబ్బ‌ ప‌డింది.2.0 చూసిన వారు ఈ సినిమాను చూస్తే 3డీలోనే చూడండి అంటూ చెప్ప‌డంతో 2డీ చూసేవారు సైతం సినిమాను చూడ‌కుండా ఆగిపోయారు.

ప్రాంతాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్..
నైజాం…………………………………7.41 కోట్లు
సీడెడ్…………………………………2.75 కోట్లు
ఉత్తరాంధ్ర………………………….2.44 కోట్లు
ఈస్ట్…………………………………..1.44 కోట్లు
వెస్ట్……………………………………1.05 కోట్లు
కృష్ణ…………………………………..1.06 కోట్లు
గుంటూరు…………………………..1.47 కోట్లు
నెల్లూరు………………………………0.94 కోట్లు

మొత్తం కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల కలెక్షన్స్ 18.56 కోట్లు అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -