Tuesday, May 14, 2024
- Advertisement -

బండ్ల గణేష్ నెంబర్ అందరికీ ఇచ్చి రెచ్చిపోమన్న రోజా

- Advertisement -

వైయస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఏది చేసిన సంచ‌ల‌న‌మే.టాపిక్ ఏది అయిన అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌లిగే రోజా త‌మ నాయ‌కుడు అయిన వైఎస్.జ‌గ‌న్ గురించి ఎవ‌రైన త‌ప్పుగా మాట్లాడితే మాత్రం వారిపై తీవ్రంగా స్పందిస్తారు.మొన్న ఆ మ‌ధ్య ప‌వ‌న్ జ‌గ‌న్ వార‌స‌త్వ రాజ‌కీయ‌లపై కామెంట్ చేసింది తెలిసిందే. దీనికి సంబ‌ధించిన చ‌ర్చ‌కు ఓ టీవి ఛానెల్‌కు వ‌చ్చిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌తో ఫోన్ లైన్లో రోజాకు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది అంద‌రికి తెలిసిందే.

తమ అధ్యక్షుడు జగన్ గురించి తప్పుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మీద రోజా తీవ్ర పరుష పదజాలంతో తో విమర్శించారు దీనికి ప్రతిస్పందన గా పవన్ అభిమాని మరియు పవన్ ని దేవునిగా బావించే బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో స్ట్రాంగ్ గా రోజా కి కౌంటర్ ఇచ్చారు.ఇదింతా ఓ టీవీ ఛానల్ వేదికగా జరిగింది ఇద్దరి మధ్య వాగ్వివాదం మంచి వేడిగా సాగింది నిన్న …అయితే ఈ రోజు రోజా సంచలకరమైన పోస్ట్ పెట్టారు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో నిర్మాత బండ్ల గణేష్ పేరు ఫోన్ నెంబర్ ని పెట్టారు ఆయన ఫోన్ నంబర్ వెల్లడించిన రోజా, కాసేపటి తరువాత సదరు పోస్టును డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే ఆ పోస్టు వైరల్ అయింది.ఇది ఇంకా ఎన్ని సంచ‌ల‌నాల‌కు దారి తీస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -